E-Paper
Advertisement

కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? ప్రాణాలు తీసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ గురించి తెలుసా?

కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? ప్రాణాలు తీసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ గురించి తెలుసా?
Advertisement

Carbon Monoxide Poisoning: కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేసేటప్పుడు అలసటగా అనిపిస్తే చాలామంది తమ కారును పక్కకు ఆపి, ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోతుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి పద్ధతి అనిపిస్తుంది. కానీ, పార్కింగ్‌లో ఉన్న కారులో ఇంజన్, ఏసీ ఆన్ చేసి నిద్రపోవడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి శబ్దం లేకుండా, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఇందుకు కారణం.

రాజస్థాన్ ఘటన నేర్పిన పాఠం:

ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఒక విషాద సంఘటన ఈ ప్రమాదాన్ని మరోసారి గుర్తుచేసింది. ఒక 37 ఏళ్ల వ్యక్తి తన కారును ఆపి, ఏసీ ఆన్ చేసి లోపల నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత కారులో ఇంధనం అయిపోవడంతో ఇంజన్ ఆగిపోయింది. మధ్యాహ్నం చూసేసరికి ఆ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. దురదృష్టవశాత్తూ అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కారులో నిద్రించడం ఎంత ప్రమాదకరమో అందరికీ కనువిప్పు కలిగించింది.

లోపల ఏం జరుగుతుందంటే?

Advertisement

కారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంజన్ నుంచి వచ్చే వ్యర్థ వాయువులు వెనక్కి వెళ్లిపోతాయి. కానీ కారు ఒకే చోట ఆగి ఉన్నప్పుడు, ఆ పొగ కారు చుట్టూ పేరుకుపోతుంది. కారు కింద ఉండే చిన్న చిన్న రంధ్రాలు లేదా ఏసీ వెంట్స్ ద్వారా ఈ ప్రమాదకర వాయువులు లోపలికి చేరుకుంటాయి. విండోస్ అన్నీ మూసి ఉండటం వల్ల లోపల ఆక్సిజన్ తగ్గిపోయి, విష వాయువులు నిండిపోతాయి.

Also Read: Redmi Note 17 వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ బ్యాటరీతో అరాచకమే!

సైలెంట్ కిల్లర్ కార్బన్ మోనాక్సైడ్:

Advertisement

కార్బన్ మోనాక్సైడ్‌కు రంగు, రుచి, వాసన ఏవీ ఉండవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. మనం మెలకువగా ఉంటే తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాల వల్ల ప్రమాదాన్ని గుర్తించి బయటకు రావచ్చు. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఈ సంకేతాలను గుర్తించలేదు. ఈ గ్యాస్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి, శరీరానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. దీంతో నిద్రలోనే తెలియకుండానే ఊపిరాడక ప్రాణాలు పోతాయి.

ఈ లోపం కూడా ఒక కారణమే:

కారు ఎగ్జాస్ట్ సిస్టమ్ లేదా ఏసీ సరిగ్గా పని చేయనప్పుడు ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. సర్వీసింగ్ సరిగ్గా లేని ఏసీల ద్వారా ఇంజన్ లోని విష వాయువులు సులభంగా క్యాబిన్ లోకి ప్రవేశిస్తాయి. చిన్న సాంకేతిక లోపాలు కూడా ఇలాంటి సమయాల్లో ప్రాణాంతకంగా మారుతుంటాయి.

సురక్షితంగా ఉండమెలా?

రన్నింగ్‌లో ఉన్న కారులో నిద్రపోయే అలవాటును పూర్తిగా మానుకోవడం మంచిది. ప్రయాణంలో బాగా అలసటగా అనిపిస్తే హోటల్ లేదా సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో కారులోనే పడుకోవాల్సి వస్తే, ఇంజన్ ఆపేసి, గాలి లోపలికి రావడానికి కారు కిటికీలను కొద్దిగా కిందకు దించాలి. అలాగే ఏటా కారు ఎగ్జాస్ట్, ఏసీ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం ద్వారా ఇలాంటి మూగ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Also Read: అబ్బా ఏం ఆఫర్లు రా బాబు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 65 శాతం డిస్కౌంట్!

Related News

డిజైన్ చూస్తే ఐఫోన్ అనుకుంటారు.. రూ.12,499కే అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Infinix కొత్త స్కెచ్!

EcoFlow పోర్టబుల్ పవర్ స్టేషన్.. కరెంట్ పోయినా మీ ఇంట్లో వైఫై, ల్యాప్‌టాప్ ఆగవు!

థియేటర్ మీ ఇంట్లోనే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

కరెంట్ బిల్లు టెన్షన్ లేకుండా.. ఇల్లు కూల్ అవ్వాలా? ఈ ఏసీలపై ఓ లుక్కేయండి!

Redmi Note 17 వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ బ్యాటరీతో అరాచకమే!

ఆన్‌లైన్ క్లాసుల కోసం.. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్‌టాప్

పొల్యూషన్ టెన్షన్ ఇక లేదు.. రూ. 2,850 కే హెపా ఫిల్టర్ ప్యూరిఫైయర్!

Big Stories

Advertisement
×