E-Paper
Advertisement

స్మార్ట్ టీవీ కొన్నారా? ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి, పిక్చర్ క్వాలిటీ అద్దిరిపోతుంది!

స్మార్ట్ టీవీ కొన్నారా? ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి, పిక్చర్ క్వాలిటీ అద్దిరిపోతుంది!
Advertisement

Best smart tv picture and sound settings: ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ.. స్మార్ట్ టీవీలు సర్వసాధారణం అయిపోయాయి. బడ్జెట్ ధరల నుంచి ప్రీమియం మోడల్స్ వరకు రకరకాల టీవీలు మార్కెట్లో రూ. 10,000 నుంచి రూ. 1,00,000 పై ధరలలో లభిస్తున్నాయి. అయితే.. మనం ఎంత ఖరీదైన టీవీ కొన్నప్పటికీ, దాని డిఫాల్ట్ సెట్టింగ్‌లతో వాడితే మాత్రం అసలైన మజా రాదు. కంపెనీలు సాధారణంగా.. అన్నింటికీ సరి పోయేలా ఆటోమేటిక్ సెట్టింగ్‌లను ఇస్తాయి. వాటిని మన అవసరానికి తగ్గట్టుగా మార్చుకుంటేనే పిక్చర్ క్లారిటీ, కలర్స్, సౌండ్ అద్భుతంగా వస్తాయి. మీ కొత్త స్మార్ట్ టీవీలో వెంటనే మార్చాల్సిన ఆ 6 కీలకమైన సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Motion Smoothing / Soap Opera Effect:

Advertisement

చాలా మోడర్న్ టీవీలలో ‘మోషన్ స్మూతింగ్’ అనే ఫీచర్ ఆన్‌లో ఉంటుంది. దీని వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు కూడా ఏదో సీరియల్ చూస్తున్నట్లుగా ..ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఒరిజినల్ ఫీల్ కోల్పోకుండా ఉండాలంటే.. టీవీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మోషన్ ఇంటర్‌పోలేషన్ లేదా ట్రూమోషన్‌ను ‘ఆఫ్’ లేదా ‘లో’ మోడ్‌లో పెట్టుకోవడం మంచిది.

2. Picture Mode :

Advertisement

టీవీని ఆన్ చేయగానే డిఫాల్ట్‌గా ‘Vivid’ లేదా ‘Dynamic’ మోడ్ ఆన్‌లో ఉంటుంది. ఇది కలర్స్ మరింత బ్రైట్ గా చూపించి కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి బదులుగా.. సెట్టింగ్స్‌లో ‘Filmmaker Mode’ లేదా ‘Movie / Cinema Mode’ ను సెలెక్ట్ చేసుకోండి. దీని వల్ల డైరెక్టర్ ఏక్యూరేట్ కలర్స్ , నేచురల్ టోన్స్‌తో సినిమాను ఎలా చూపించాలనుకున్నారో మీకు అలాగే కనిపిస్తుంది.

Also Read:చెత్తను క్షణాల్లోనే క్లీన్ చేసే.. వాక్యూమ్ క్లీనర్స్

3.Sharpness:

చాలా మంది టీవీలో.. షార్ప్‌నెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెంచుతుంటారు. దీని వల్ల పిక్చర్ అంచులు గరుకుగా, కృత్రిమంగా మారుతాయి. పిక్చర్ నాణ్యత సహజంగా..స్పష్టంగా ఉండాలంటే.. షార్ప్‌నెస్‌ను సుమారు 10 నుంచి 20 శాతానికి తగ్గించడం బెస్ట్.

4. Energy Saving/Auto Brightness:

కొన్ని స్మార్ట్ టీవీలలో గదిలోని వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్ అదే మారే ఆటో బ్రైట్‌నెస్ లేదా ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటుంది. దీని వల్ల కొన్ని రకాల స్క్రీన్ లు వచ్చేటప్పుడు స్క్రీన్ మరీ చీకటిగా మారుతుంది. దీన్ని ఆఫ్ చేయడం ద్వారా మీరు ఎల్లప్పుడూ ఒకే రకమైన బ్రైట్‌నెస్, క్లారిటీని పొందవచ్చు.

5. Noise Reduction:

లో క్వాలిటీ వీడియోలు లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు పిక్చర్‌లో గ్రెయిన్ కనిపించకుండా ఉండేందుకు నాయిస్ రిడక్షన్ వాడతాం. కానీ.. దీన్ని అతిగా ఆన్ చేస్తే.. ముఖాలపై ఉన్న సహజత్వం పోయి ప్లాస్టిక్ లాగా కనిపిస్తాయి. అందుకే.. దీన్ని ‘Low’ లేదా ‘Off’ లో ఉంచడం మంచిది.

6.Sound mode:

కేవలం పిక్చరే కాకుండా సౌండ్ కూడా చాలా ముఖ్యం. స్టాండర్డ్ సౌండ్ మోడ్‌కు బదులుగా ‘Movie’ లేదా ‘Standard’ మోడ్‌ను ఎంచుకుని, ఒకవేళ వర్చువల్ సరౌండ్ సౌండ్ ఆప్షన్ ఉంటే.. దాన్ని ఆన్ చేసుకోండి. ఇది డైలాగ్స్‌ను స్పష్టంగా వినడానికి సహాయ పడుతుంది.

కొత్త స్మార్ట్ టీవీ కొన్న తర్వాత.. ఈ చిన్న చిన్న సెట్టింగ్ మార్పులు చేయడం ద్వారా.. బెస్ట్ పక్చర్ క్వాలిటీ, సౌండ్ పొందొచ్చు.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×