E-Paper
Advertisement

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?
Advertisement

Smartphone warnings signs: మనం నిత్యం వాడే స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతీ చిన్న పనికి ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే రోజూ వాడే క్రమంలో ఫోన్లలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఛార్జింగ్ సరిగ్గా అవ్వకపోవడం, ఫోన్ విపరీతంగా హీట్ అవ్వడం, యాప్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వడం లేదా స్క్రీన్ మీద చిన్న గీతలు రావడం వంటివి జరుగుతుంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోకుండా అలాగే వాడుతుంటారు. కానీ.. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే భవిష్యత్తులో మీ ఫోన్‌ను పూర్తిగా డెడ్ చేసేయడమో లేదా వేల రూపాయలు ఖర్చు పెట్టించడమో చేస్తాయి. స్మార్ట్‌ ఫోన్ రిపేర్ పరంగా మనం చేయకూడని పొరపాట్లు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. ఫోన్ వేడెక్కడాన్ని తేలిగ్గా తీసుకోవద్దు:

గేమ్స్ ఆడుతున్నప్పుడు.. లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కొద్దిగా.. వేడెక్కడం సాధారణమే. కానీ.. ఎలాంటి పని చేయకపోయినా, ఫోన్ వాడకపోయినా విపరీతంగా హీట్ అవుతుంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రాసెసర్ లేదా బ్యాటరీ దెబ్బతింటున్నదానికి ప్రధాన సంకేతం. ఇలాంటి సమయంలో బ్యాక్‌గ్రౌండ్ రన్ అయ్యే యాప్స్‌ని క్లోజ్ చేయడం, లోకల్ ఛార్జర్‌లను వాడటం మానేయడం మంచిది.

Advertisement

2. బ్యాటరీ సమస్య:

ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా.. 100 శాతం నుంచి 20 శాతానికి పడిపోవడం లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లు అనిపించడం జరిగితే అది ప్రమాదకరమైన హెచ్చరిక.ఉబ్బిన బ్యాటరీని అలాగే వదిలేస్తే..అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. వెంటనే సర్వీస్ సెంటర్‌కి వెళ్లి బ్యాటరీని మార్పించుకోవడం అవసరం.

3. ఛార్జింగ్ పోర్ట్ సమస్యలు, డస్ట్ క్లీనింగ్:

Advertisement

ఛార్జింగ్ కేబుల్ పెట్టినప్పుడు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, కాస్త కదిలితే.. ఛార్జింగ్ ఆగిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. చాలా మంది దీన్ని కేబుల్ ప్రాబ్లం అనుకుని వదిలేస్తారు.కానీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో.. పేరుకుపోయిన ధూళి వల్ల ఈ సమస్య వస్తుంది. దాన్ని టూత్‌ పిక్ లేదా మెత్తటి బ్రష్‌తో జాగ్రత్తగా.. క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా బలంగా కేబుల్ దూర్చితే పోర్ట్ పూర్తిగా దెబ్బతింటుంది.

4. చిన్న స్క్రీన్ క్రాక్స్ :

ఫోన్ కింద పడినప్పుడు స్క్రీన్ పైన చిన్న గీత లేదా పగులు వస్తే.. టచ్ బాగానే పనిచేస్తుంది కదా అని చాలా మంది అలాగే వాడుతుంటారు. కానీ లోపలి డిస్‌ప్లే ప్యానెల్ పై ప్రెజర్ పడి క్రమంగా స్క్రీన్ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆ పగుళ్ల ద్వారా చెమట లేదా నీరు లోపలికి వెళ్లి మదర్ బోర్డ్‌ను పాడు చేస్తుంది.

Also Read: ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

5. ఫోన్ హ్యాంగ్ అవ్వడం:

ఫోన్ మెమరీ పూర్తిగా నిండిపోతే.. సిస్టమ్ స్లో అయిపోయి పదే పదే హ్యాంగ్ అవుతుంది. దీన్ని సరిచేయకుండా.. అలాగే వాడితే ఫోన్ సాఫ్ట్‌వేర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పటికప్పుడు అనవసరమైన ఫైల్స్, వీడియోలను డిలీట్ చేసి స్టోరేజ్ ఫ్రీగా ఉంచుకోవడం ఫోన్ ఆయువును పెంచుతుంది.

స్మార్ట్‌ఫోన్ అనేది ఖరీదైన గాడ్జెట్. చిన్న సమస్య వచ్చినప్పుడే దాన్ని సరిదిద్దుకుంటే.. పెద్ద ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. అందుకే మీ ఫోన్ ఇస్తున్న చిన్న చిన్న హెచ్చరికలను గమనించి, సకాలంలో జాగ్రత్తలు తీసుకోండి.

Related News

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×