E-Paper
Advertisement

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!
Advertisement

Honda’s 2 New SUVs for India: భారత కార్ మార్కెట్లో SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్, కియా, మారుతి, టయోటా, స్కోడా లాంటి కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హోండా కూడా తన SUV లైనప్‌ను బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్లో రెండు కొత్త SUVలను తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ముందుగా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్

హోండా నుంచి మొదటగా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎలివేట్‌ను 2023లో భారత్‌లో పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత మిడ్-సైకిల్ అప్‌డేట్ తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. కొత్త వెర్షన్‌ను ఇప్పటికే భారత్‌ తో పాటు జపాన్‌లో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. టెస్టింగ్‌లో కనిపించిన కార్లపై పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే, సాధారణ ఫేస్‌లిఫ్ట్‌లో ఉండే కాస్మెటిక్ మార్పులతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

డిజైన్‌లో స్వల్ప మార్పులు

Advertisement

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేసిన బంపర్లు, మారిన హెడ్‌ల్యాంప్ గ్రాఫిక్స్, కొత్త రేడియేటర్ గ్రిల్, మెరుగైన లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ కనిపించే అవకాశం ఉంది. కొత్త డిజైన్‌తో కూడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. క్యాబిన్‌లో పెద్ద మార్పులు చేయకుండా అప్‌హోల్స్టరీ, ట్రిమ్ లాంటి అంశాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, పోటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక ఫీచర్లను జోడించవచ్చని అంచనా.

కొత్త ఫీచర్లపై ఫోకస్

ప్రస్తుతం ఈ విభాగంలోని చాలా SUVల్లో అందుబాటులో ఉన్న ఫీచర్లను ఎలివేట్‌లో కూడా తీసుకురావాలని హోండా భావిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, ముందు సీట్లకు వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, USB Type-C పోర్టులు లాంటి సదుపాయాలు ఇందులో చేరే అవకాశం ఉంది.

Advertisement

ఇంజిన్ విషయంలో మాత్రం పెద్ద మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 119hp పవర్, 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగుతాయి.

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV ‘0 ఆల్ఫా’

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ తర్వాత హోండా మరింత కీలకమైన అడుగు వేయనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కంపెనీ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోడల్  0 ఆల్ఫా ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ SUV మారుతి e Vitara, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400 వంటి మోడళ్లతో పోటీపడనుంది. హోండా 0 SUV కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేకమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది.

Read Also: JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

Tags

Related News

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ మారితే కొత్త ట్యాగ్ అవసరం లేదు!

1980’sలోబాలీవుడ్‌ను ఏలిన 5 కార్లు ఇవే.. హీరోల కంటే ఈ కార్లకే ఎక్కువ క్రేజ్!

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

Big Stories

Advertisement
×