E-Paper
Advertisement

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!
Advertisement

Smartphone Privacy Alert: మీ ఫోన్‌కాల్స్‌ ఎవరో వింటున్నారు. మీ మెసేజ్‌ లు పరాయివారు చదువుతున్నారు. మొబైల్‌ లో సేవ్‌ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ రహస్యంగా తెలుసుకుంటున్నారు. మీరు ఎక్కడున్నదీ లొకేషన్ వీడియోతో సహా ఎక్కడికో చేరిపోతోంది. మీ మొబైల్‌ కెమేరానే మీ సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా పంపిస్తోంది. అవును మీరు విన్నదంతా నిజమే! ఇప్పుడంతా స్మార్ట్‌ ఫోన్ యుగం! మొబైల్‌ యూజర్లంతా క్రేజీగా లేటెస్ట్‌ ఫోన్లకు షిఫ్టవుతున్నారు! కానీ, స్మార్ట్‌ పక్కనే థెఫ్ట్‌ కూడా ఉందని తెలిస్తే వెన్నులో మిన్నాగు దూరుతుంది! మీ మొబైల్‌లో సమాచారాన్నే కాదు.. మీ పర్సనల్‌ స్పేస్‌ ని కూడా బట్టబయలు చేసే అప్లికేషన్‌ లు మార్కెట్‌లోకొస్తున్నాయ్‌.. అంతే కాదు బ్యాంకు ఎకౌంట్ డేటా, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్ల లాంటి కాన్ఫిడెన్సియల్‌ ఇన్ఫర్మేషన్‌ కూడా కాపీ చేసే ప్రమాదముంది.. మీకు ఏ మాత్రం తెలీకుండానే ఇదంతా జరుగుతుంది.. అంటే, ఓ కొత్త అప్లికేషన్ మీ మొబైల్లో రన్‌ అవుతున్న అనుమానం ఏ మాత్రం రాదు. చడీ చప్పుడు కాకుండా సమాచారాన్ని ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తాయ్‌.

లక్షల్లో స్పై యాప్స్!

ఇప్పటికే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు లక్షల్లో దొరుకుతున్నాయ్‌ వీటిలో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌, సెక్యూరిటీ ఇచ్చేవి కొన్నయితే.. యూజర్లమీద నిఘా పెట్టే అప్లికేషన్లు మరికొన్ని. కొద్దికాలం క్రితం యూఎస్‌ మిలిటరీ ఎక్స్‌ పర్ట్స్‌ ఓ అప్లికేషన్‌ తయారు చేసింది. దాని పేరు ప్లేస్‌ రైడర్‌. ఇది స్మార్ట్‌ మొబైల్‌ కెమేరాని స్పై టూల్‌గా వాడుకుంటుంది. అంటే, ఈ ఆప్‌ లోడ్‌ చేసిన మొబైల్‌ నుంచి లొకేషన్‌ ఫోటోలు, వీడియోల్లాటి సమాచారాన్ని పొందొచ్చు. అంతే కాదు ఈ ఇన్ఫర్మేషన్ త్రీడీలో కూడా చూసే వీలుంది.

Advertisement

ప్లేస్‌ రైడర్‌ యాప్‌ని ఆల్‌రెడీ ఓ 20మంది యూజర్లపై ప్రయోగించారు. వాళ్లు చేసే ప్రతిపనిని కామ్‌ గా రికార్డు చేసి పంపిందీ యాప్. ఇది ఎంత కచ్చితంగా పని చేసిందంటే యూజర్ ఉన్న గది ఫోటోలు త్రీడీలో ఇస్తూ పొడవు వెడల్పు స్పష్టంగా అర్ధమయ్యేట్టు.. ఎక్కడ ఏ వస్తువుందో తెలిసేట్టుగా ఫోటోలు తీసి పంపింది. అఖరికి చెక్‌ బుక్కుల మీద పెట్టే సంతకాలను కూడా కాప్చర్‌ చేసింది. సొంత ఫోన్‌ కెమేరానే శత్రువుగా మార్చే పవర్‌ పుల్‌ యాప్‌ ఇది. యాండ్రాయిడ్‌ 2.3 ఆ తర్వాత వెర్షన్ల నుంచి పనిచేసే ఈ టూల్‌ హ్యాకర్ల చేతిలోకొస్తే అంతే సంగతులు!

ఫోన్ లోని సమాచారం అంతా లీక్!

ఒక్క ప్లేస్ రైడరే కాదు.. ఇప్పటికే నెట్‌లో అనేక పెయిడ్‌ అప్లికేషన్లున్నాయి. యాండ్రాయిడ్‌, యాపిల్‌ ఐ పోన్ల కోసం తయారు చేసిన ఈ యాప్స్ గుట్టు చప్పుడు కాకుండా మొబైల్ లో ఎంటరై… కాల్స్‌ డేటా, మెసేజెస్‌, లొకేషన్ ఇన్ఫర్మేషన్‌ సహా కాపీ చేస్తున్నాయ్‌. అన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్‌ కాల్స్‌ నిమొత్తం రికార్డు చేసేస్తయ్‌.. లొకేషన్ ఇన్ఫర్మేషన్‌ ని చెప్తయ్‌. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా యూజర్‌ లొకేషన్ కచ్చితంగా ఫైండవుట్‌ చేయొచ్చు. మొబిస్టెల్త్‌, మొబైల్‌ స్పై లాంటి పేర్లతో మార్కెట్‌లో చాలా అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయ్.

Advertisement

స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంది కదాని సంబరపడటం కాదు… మనపై ఎవరు స్పైయింగ్‌ చేస్తున్నారో అని టెన్షన్‌పడాల్సిన టైమొచ్చింది. అయితే, ప్రతీ సమస్యకు ఓ సొల్యూషన్‌ ఉన్నట్టే.. ఈ స్పై టూల్స్ ని సమర్ధంగా ఎదుర్కునే యాంటి యాప్స్ కూడా తయారవుతున్నాయ్‌. అన్‌నోన్ అప్లికేషన్లు ఎంటర్‌ కాకుండా పహారా కాసే టూల్స్ మార్కెట్‌లో వస్తున్నాయ్‌.. సో.. స్మార్ట్‌ కొనగానే పండగ చేసుకోవద్దు.. సెక్యూరిటీ ఎంత ఉందో చూసుకోవటం ముఖ్యం!

Read Also: ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా చూస్తున్నారు జాగ్రత్త!

Tags

Related News

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Big Stories

Advertisement
×