E-Paper
Advertisement

వావ్.. షుగర్ టెస్ట్ నుంచి శాటిలైట్ కనెక్టివిటీ వరకు.. అన్నీ ఈ స్మార్ట్‌వాచ్‌లోనే!

వావ్.. షుగర్ టెస్ట్ నుంచి శాటిలైట్ కనెక్టివిటీ వరకు.. అన్నీ ఈ స్మార్ట్‌వాచ్‌లోనే!
Advertisement

Smartwatch Trends 2026: ఇప్పుడు కాలం మారిపోయింది. ఒకప్పుడు చేతి గడియారం అంటే కేవలం టైమ్ చూసుకోవడానికే అనుకునేవాళ్లం. కానీ, నేటి టెక్ యుగంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ కేవలం గడియారం మాత్రమే కాదు.. మన ఆరోగ్యాన్ని చూసుకునే డాక్టర్, ఆపదలో ఆదుకునే స్నేహితుడు, ఇంకా చెప్పాలంటే మన చిన్నపాటి స్మార్ట్‌ఫోన్ కూడా. ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న వాచీలు చూస్తుంటే టెక్నాలజీ ఎక్కడికో వెళ్లిపోయిందనిపిస్తుంది.

సిగ్నల్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు:

ఈ ఏడాది స్మార్ట్‌వాచ్‌లలో వచ్చిన బిగ్గెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. శాటిలైట్ కనెక్టివిటీ. సాధారణంగా మనం అడవులకో, కొండలకో ట్రిప్ వెళ్లినప్పుడు ఫోన్ సిగ్నల్ ఉండదు. అలాంటి టైం‌లో ఏవైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు వస్తున్న ప్రీమియం వాచీలు నేరుగా శాటిలైట్ ద్వారా మెసేజ్ పంపే సదుపాయాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు.. ఫోన్‌తో సంబంధం లేకుండానే వాచ్ నుండే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ట్రావెలర్స్‌కు, ట్రెకింగ్ చేసే వాళ్లకు ఇది నిజంగా ఒక వరం లాంటిదే.

ఆరోగ్యంపై నిరంతరం నిఘా:

Advertisement

ఆరోగ్యం విషయంలో స్మార్ట్‌వాచ్‌లు చేసే ములు అంతా ఇంతా కాదు. రక్తంలో ఆక్సిజన్, గుండె వేగం మాత్రమే కాదు.. ఇప్పుడు షుగర్ లెవల్స్ కూడా చూసుకోవచ్చు. అది కూడా సూది గుచ్చకుండానే. బీపీ ఎంతుందో కూడా వాచ్ చెప్పేస్తుంది. మనం సరిగ్గా నిద్రపోతున్నామా లేదా? ఒకవేళ నిద్రలో ఏవైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయా? అనేది AI కనిపెట్టి మరీ మనకు రిపోర్ట్ ఇస్తుంది. మన ఒత్తిడిని బట్టి మనం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో కూడా ఇవి సలహాలు ఇస్తాయి.

Also Read: OPPO Find X9 సిరీస్ ఊరమాస్ ఎంట్రీ.. ఐఫోన్ రేంజ్‌లో ఫీచర్లు, ధర తెలిస్తే మాత్రం కళ్లు మెలేస్తారు!

లుక్ అదిరిపోవాలి.. ఫీచర్లు బాగుండాలి:

Advertisement

కేవలం ఫీచర్లు ఉంటే సరిపోదు కదా, లుక్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు వాచీలు చూడటానికి ఒక ఆభరణంలా, ఒక క్లాసిక్ మెటల్ వాచ్‌లా ఉంటున్నాయి. boAt లాంటి బ్రాండ్లు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జ్యువెలరీ డిజైన్‌తో వాచీలు తెచ్చాయి. ఆఫీస్‌కు వెళ్లే వారి కోసం టైటాన్ క్రెస్ట్ లాంటివి క్లాసిక్ మెటల్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునే వారి కోసం ఫైర్ బోల్ట్, నాయిస్ వంటివి తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్నాయి.

అడ్వెంచర్స్ చేసే వారికి స్పెషల్ వాచ్‌లు:

మీరు గనుక ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే లేదా రోజూ రన్నింగ్ చేసే అలవాటు ఉంటే.. మీ కోసం రెడ్‌మీ, అమేజ్‌ఫిట్ వంటి బ్రాండ్లు సూపర్ వాచీలు తెచ్చాయి. వీటిలో జీపీఎస్ పక్కాగా పనిచేస్తుంది. మనం ఎక్కడ ఉన్నామో దారి చూపే ఆఫ్‌లైన్ మ్యాప్స్ కూడా ఉంటాయి. పడిపోయినా, కొట్టుకుపోయినా ఏమీ కాకుండా సాఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాచ్‌లోనే పాటలు స్టోర్ చేసుకుని, ఫోన్ ఇంట్లో వదిలేసి ప్రశాంతంగా వర్కవుట్ చేసుకోవచ్చు.

వాచ్ చెప్పిందే వేదం అనుకోవద్దు:

స్మార్ట్‌వాచ్‌లు ఇంతగా డెవలప్ అవ్వడం నిజంగా మంచి విషయమే. గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చినా, మరేదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఇవి ముందే మనల్ని అలర్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ వాచీలు ఇచ్చే సమాచారం మనకు ఒక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రం కచ్చితంగా డాక్టరును కలిసి చెకప్ చేయించుకోవాలి. టెక్నాలజీ సాయం తీసుకోవాలి కానీ.. అదే సర్వస్వం అనుకోకూడదు.

Also Read: రూ.80 వేల Vivo X300 FE ఫోన్ జస్ట్ రూ.61 వేలకే.. ఈ ట్రిక్ వాడండి చాలు!

Tags

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×