E-Paper
Advertisement

Storage Tips: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!

Storage Tips: గూగుల్ ఫొటోస్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ 5 ట్రిక్స్‌ పాటిస్తే నిమిషాల్లో స్పేస్ ఖాళీ!
Advertisement

Storage Tips: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ నుండి స్టోరేజ్ ఫుల్ అనే నోటిఫికేషన్ రావడం సర్వసాధారణం. మనం ఫోన్ వాడుతున్నప్పుడు అనవసరమైన స్క్రీన్‌షాట్లు, వీడియోలు తీస్తూనే ఉంటాం కానీ పాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. దీనివల్ల ముఖ్యమైన ఫొటోలు, ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి చోటు ఉండదు. ఒక్కో ఫొటోను వెతికి డిలీట్ చేయడం చాలా సమయం తీసుకుంటుంది. అందుకే తక్కువ టైం‌లో మీ గూగుల్ స్టోరేజ్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

⇒ ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి. అందులో మీరు వాడుతున్న ఈ-మెయిల్ ఐడి లాగిన్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

Advertisement

⇒ యాప్ పైన కనిపించే మీ ప్రొఫైల్ ఫొటో మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ Backup అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి. ఇది ఆన్‌లో ఉంటేనే మీ ఫోన్‌లోని ఫొటోలు ఆటోమేటిక్‌గా గూగుల్ అకౌంట్‌లోకి సేవ్ అవుతాయి.

Also Read: ల్యాప్‌టాప్‌‌‌ నుంచి ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ ఫోన్ పని గోవిందా.. ఎందుకంటే?

Advertisement

⇒ బ్యాకప్ పూర్తయిన తర్వాత Free up Space on This Device అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తద్వారా ఇప్పటికే గూగుల్‌లో సేవ్ అయిన ఫొటోలు మీ ఫోన్ మెమొరీ నుండి డిలీట్ అయ్యి ఫోన్‌లో స్పేస్ పెరుగుతుంది. ఆ తర్వాత Review Out of Sync Changes లోకి వెళ్లి అక్కడున్న అనవసరమైన వీడియోలను డిలీట్ చేయొచ్చు.

⇒ ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే అకౌంట్ సెట్టింగ్స్‌లో Manage Storage ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ ఉన్న వీడియోలు, అనవసరమైన ఈ-మెయిల్ అటాచ్‌మెంట్‌లు ఎంత మెమొరీని వాడుతున్నాయో క్లియర్‌గా కనిపిస్తుంది. వాటిని రివ్యూ చేసి మీకు అవసరం లేని వాటిని ఒకేసారి డిలీట్ చేయొచ్చు.

⇒ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇలా ఒక్కసారి డిలీట్ చేసిన ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తిరిగి రావు. కాబట్టి.. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని డిలీట్ చేయడం మంచిది.

Also Read: ఫస్ట్ టైం ఓవెన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది జాగ్రత్త!

Related News

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

Big Stories

Advertisement
×