E-Paper
Advertisement

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?
Advertisement

Google Fitbit Air: గూగుల్ తమ కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ను ఈ అక్టోబర్‌ నెలలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన Made by Google ఈవెంట్‌లో Pixel 11 సిరీస్ ఫోన్లు, Pixel Watch 5, Pixel Tagలతో పాటు ఈ కొత్త డివైజ్ గురించిన సమాచారాన్ని అందించింది. డిస్‌ప్లే లేని డిజైన్‌తో వస్తున్న కంపెనీ మొదటి ఫిట్‌నెస్ ట్రాకర్ ఇది కావడం విశేషం.

త్వరలోనే భారత మార్కెట్లోకి:

మే నెలలోనే అంతర్జాతీయంగా లాంచ్ అయిన ఈ డివైజ్.. త్వరలోనే ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. పింక్ కలర్ పెర్ఫార్మెన్స్ లూప్ బ్యాండ్‌తో ఉన్న మోడల్‌ను గూగుల్ ప్రదర్శించింది. అధికారికంగా డేట్, ధర వెల్లడించనప్పటికీ.. ఇప్పటికే అమెజాన్ ఇండియాలో కొన్ని థర్డ్ పార్టీ సెలర్స్ దీని రేటును రూ.17,380 నుండి రూ.18,490 మధ్యలో లిస్ట్ చేశారు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో దీని ప్రారంభ ధర రూ.9,550గా ఉంది.

Advertisement

Also Read: యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

డిస్ట్రాక్షన్ లేని డిజైన్:

ఈ ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో ఎలాంటి స్క్రీన్ ఉండదు. పదే పదే నోటిఫికేషన్లు, అలర్ట్స్ చూస్తూ సమయం వృధా కాకుండా, రోజంతా ప్రశాంతంగా ధరించేలా దీనిని రూపొందించారు. పెర్ఫార్మెన్స్ లూప్, యాక్టివ్, ఎలివేటెడ్ మోడర్న్ అనే మూడు రకాల మార్చుకోగలిగే బ్యాండ్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

హెల్త్ ట్రాకింగ్ సులభం:

Advertisement

స్క్రీన్ లేకపోయినా హెల్త్ ట్రాకింగ్ విషయంలో ఇది ఎక్కడా తగ్గదు. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్, గుండె లయను కనిపెట్టే ఏఫిబ్ అలర్ట్స్, రక్తంలో ఆక్సిజన్ స్థాయులను కొలిచే SpO2 సెన్సార్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్లీప్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ వేరియబిలిటీని ఇది నిరంతరం గమనిస్తుంది.

గూగుల్ హెల్త్ సేవలు:

గ్లోబల్‌గా ఈ డివైజ్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలల ఉచిత ‘గూగుల్ హెల్త్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా యూజర్లు గూగుల్ హెల్త్ కోచ్ టూల్స్‌ను ఉపయోగించుకుని తమ ఫిట్‌నెస్‌ను మరింత సమర్థవంతంగా మెరుగుపరుచుకోవచ్చు. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా కేవలం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ కానుంది.

Also Read: లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×