BigTV English

Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్

Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్

Education commission : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్‌కు ఆరుగురితో సలహా కమిటీ ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ కె.మురళీ మోహన్, కె.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంటకరెడ్డి, యునిసెఫ్ విద్యా నిపుణుడు కెఎం. శేషగిరి ఉన్నారు. గతంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా కమిషన్ కు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ALSO READ:జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

లోపాలను సరిదిద్దేందుకు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆకునూరి మురళి ఛైర్మన్‌గా విద్యాకమిషన్ ఏర్పాటుకాగా, మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. తాజాగా, ఈ కమిషన్‌కు అనుబంధంగా ఆరుగురు విద్యారంగ నిపుణులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలపై ఈ కమిటీ కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇవ్వనుంది. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి కూడా ఈ సలహా కమిటీ మార్గదర్శకత్వం వహించనుంది.


Related News

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Big Stories

×