BigTV English

Shock to Swarupananda: జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

Shock to Swarupananda: జగన్ గురువుకు షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. ఇంతటితో ఆగేనా.. ఇంకా ఉందా..

Shock to Swarupananda: మాజీ సీఎం జగన్ (Jagan) కు ప్రభుత్వం భారీ షాకిచ్చినట్లే చెప్పవచ్చు. జగన్ (Jagan)  ఏ పని తలపెట్టినా ఆ గురువు మాట వింటారు. ఈ గురువంటే జగన్ కు అంత అభిమానం. అలాంటి గురువుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షాక్ అలాంటిది, ఇలాంటిది కాదు. ఏకంగా చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీకి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చేసింది.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ఓ వెలుగు వెలిగారనే చెప్పవచ్చు. ఈ స్వామి శిష్యుడిగా మాజీ సీఎం జగన్ మెలిగేవారు. స్వామి వద్దకు సీఎం హోదాలో జగన్ (Jagan) వెళ్లి కలవడమే కాక, ఆయనకు పాదాభివందనం కూడా చేసేవారు. ఇలా సీఎం వెళ్లి కలవగా.. మంత్రులు కూడా స్వరూపానంద స్వామి (Swarupananda Swami) పీఠం దారి పట్టారు. ఒకరి తర్వాత ఒకరు రోజూ స్వామి వారి దర్శనార్థం వెళ్లేవారు. అయితే రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలపై స్వామి కొంత రుసరుసలాడారు కూడా. అయితే ఏపీ ఎన్నికల వరకు గురు శిష్యుల అనుబంధం బాగానే కొనసాగింది.

అయితే నాటి వైసీపీ ప్రభుత్వం విశాఖలో శారదా పీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చింది. అప్పుడు ఈ స్థలం పీఠంకు ఇవ్వడంపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారింది. సీఎంగా చంద్రబాబు (Chandrababu) , డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాలనా పగ్గాలు చేపట్టారు. ఎన్నికల ముందు వరకు ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో కనిపించే స్వరూపానంద స్వామి సైలెంట్ అయ్యారు. ఎక్కడా అంతగా కనిపించని పరిస్థితి. అటువంటి సమయంలో ప్రస్తుత ప్రభుత్వం.. స్వామి వారికి షాకిచ్చే ప్రకటన చేసింది.


గతంలో పీఠంకు వైసీపీ ప్రభుత్వం అందించిన 15 ఎకరాల స్థలానికి ప్రభుత్వ అనుమతులు రద్దు చేస్తూ.. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠం చేపట్టిన నిర్మాణంపై కూడా చర్యలు తీసుకోవాలని టీటీడీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే.. కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి నాటి ప్రభుత్వం ఇచ్చిందని, అందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Also Read: Kadapa Crime: అత్యాచారమా.. కాదా.. కారకులు ఎవరు? కడప జిల్లాలో బాలికపై పెట్రోల్.. సీఎం చంద్రబాబు సీరియస్

అయితే ఈ ప్రకటనతో నాటి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని నేటి ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తున్నట్లు భావించవచ్చు. ఈ క్రమంలోనే ఇటువంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద నాటి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను.. కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై, మాజీ సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×