Big Stories

Motorola Edge 30 Ultra : మోటో యూజర్లకు అలర్ట్.. ఈ అప్‌డేట్ చెక్ చేయండి!

Motorola Edge 30 Ultra Android 14 Update : టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒక్కటైనా మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 2022లో విడుదల చేసింది. ఆ సమయంలో ఈ ఫోన్ Android 12తో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌కు Android 14 అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు కంపెనీ ఫోన్‌కు తీసుకొచ్చిన మూడవ అప్‌డేట్. దీని కోసం ఆండ్రాయిడ్ 13 గత సంవత్సరం విడుదల చేయబడింది. ఈ ఫర్మ్‌వేర్ U1SQS34.52-21-1-7 వెర్షన్‌తో వస్తుంది. ఇది 1.49GB వరకు స్టోరేజ్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌తో సరికొత్త ఫీచర్లను కూడా చూడొచ్చు. ఈ లెటెస్ట్ వెర్షన్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలి. ఎలాంటి ఫీచర్లు ఉంటాయి. తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

మీరు మోటరోలా Edge 30 Ultra ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ కోసం U1SQS34.52-21-1-7 వెర్షన్‌తో వస్తుంది. ఇది 1.49GB స్టోరేజ్ తీసుకుంటుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.
దీనికి అప్‌గ్రేడ్‌లుగా అనేక కొత్త విడ్జెస్ చూడొచ్చు. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గతంలో కంటే మెరుగైన అనుభూతిని పొందుతారు. మీ డేటా సైతం చాలా సేఫ్‌గా ఉంటుంది.

- Advertisement -

Also Read : అదిరిందయ్యా.. రెడ్‌మీ నుంచి 200 MP కెమెరా ఫోన్!

అంతేకాకుండా ఈ కొత్త ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌లో వినియోగదారులు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫోటో లేదా విడియోను ప్రత్యేకంగా అనుమతించే పీచర్‌ను పొందుతారు. అంటే మొత్తం స్టోరేజ్ ఫైల్‌కు దేనికైనా యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ యూజర్లు తమ లొకేషన్‌కు ఏ థర్డ్ పార్టీ యాప్ యాక్సెస్ ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు మీ హెల్త్ డేటాను కంట్రోల్ చేయవచ్చు. ఇందులో మాగ్నిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ లెటెస్ట్ అప్‌డేట్ తీసుకొచ్చారు.

 ఈ కొత్త ఆండ్రాయిడ్ 14‌ను ఎలా పొందాలంటే?

  • ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లాలి.
  • ఆపై సిస్టమ్ అప్‌డేట్ క్లిక్ చేయండి.
  • అప్‌డేట్‌లను చెక్ చేయండి.
  • ఏదైనా అప్‌డేట్ ఉంటే మీరు దాన్ని డౌన్‌లోడ్ చేయాలి.
  • ఆ తర్వాత ఇనస్టాల్ చేసుకోండి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News