E-Paper
Advertisement

రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!

రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!
Advertisement

Thomson Alpha QLED 40 inch smart TV:  మీ ఇంటి కోసం కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? బడ్జెట్ తక్కువగా ఉండి, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ , అదిరి పోయే సౌండ్.. కోరుకునే వారికి థామ్సన్ బ్రాండ్ ఒక అద్భుతమైన ఆప్షన్‌ను అందిస్తోంది. అసాధారణమైన ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రూ.14,999 ధరలోనే.. లభించే ఈ స్మార్ట్ టీవీకి మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 పూర్తి ఫీచర్లు:

క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్ హైలెట్ దీనిలోని.. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ. ఈ బడ్జెట్ రేంజ్‌లో.. క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే దొరకడం నిజంగా బెస్ట్ ఆప్షన్. దీని వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, కాంట్రాస్ట్, బ్రైట్‌ నెస్ చాలా సహజంగా కనిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు లేదా వీడియో గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ ఎంతో షార్ప్‌గా, స్పష్టంగా ఉంటాయి. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో.. పోలిస్తే ఇది మరింత మెరుగైన వ్యూయింగ్ ఫీల్ ఇస్తుంది.

పవర్‌ఫుల్ 36W సౌండ్ అవుట్‌ పుట్:

Advertisement

స్మార్ట్ టీవీల్లో.. సాధారణంగా సౌండ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందనే.. కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది. కానీ.. ఈ థామ్సన్ టీవీ ఆ లోటును పూర్తిగా తీరుస్తుంది. ఇందులో.. బిల్ట్-ఇన్ స్పీకర్లతో కూడిన బలమైన 36W సౌండ్ అవుట్‌ పుట్ ఇచ్చారు. అదనంగా.. హోమ్ థియేటర్ స్పీకర్లు.. పెట్టాల్సిన అవసరం లేకుండానే.. గది మొత్తం మార్మోగేలా క్లియర్, లౌడ్ సౌండ్ వస్తుంది. పాటలు వినేటప్పుడు, యాక్షన్ మూవీస్ చూసేటప్పుడు.. ఈ ఆడియో ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

Also Read: రూ.1,999లకే అద్భుతమైన ఫీచర్లు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఓ లుక్కేయండి

స్మార్ట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ & కనెక్టివిటీ :

Advertisement

ఈ టీవీ స్మార్ట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని ద్వారా.. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే.. ఇందులో ఉన్న వెబ్ బ్రౌజర్ సహాయంతో నేరుగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా.. చేసుకోవచ్చు. బ్లూటూత్, వైఫై, హెచ్‌డీఎం, యూఎస్‌బీ పోర్ట్‌లు వంటి బహుళ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండటం వల్ల సెట్-టాప్ బాక్స్, పెన్‌డ్రైవ్‌లు లేదా.. గేమింగ్ కన్సోల్స్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

స్టైలిష్ డిజైన్, బడ్జెట్ :

ఈ టీవీ చూడటానికి చాలా సన్నని బెజెల్స్‌తో.. మోడర్న్ లుక్‌లో వస్తుంది. లివింగ్ రూమ్ లేదా బెడ్‌ రూమ్ గోడకు మౌంట్ చేసినా .. లేదా టేబుల్ మీద పెట్టినా ఇది ఇంటికి ఒక రిచ్ లుక్‌ని ఇస్తుంది. అన్నింటికంటే.. మించి కేవలం రూ.14,999 ధరకే ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభించడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.

మీ బడ్జెట్ తక్కువగా ఉండి.. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా.. ప్రీమియం క్యూఎల్ఈడీ ఫీల్ కావాలనుకుంటే.. ఈ మోడల్ ఒక అద్భుతమైన ఛాయిస్. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ!

Related News

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

Big Stories

Advertisement
×