E-Paper
Advertisement

స‌న్ రైజ‌ర్స్, గంభీర్ మ‌ధ్య భారీ డీలింగ్..ఇక 2027 ఐపీఎల్ మాములుగా ఉండ‌దు!

స‌న్ రైజ‌ర్స్, గంభీర్ మ‌ధ్య భారీ డీలింగ్..ఇక 2027 ఐపీఎల్ మాములుగా ఉండ‌దు!
Advertisement

Gambhir as Sunrisers Hyderabad Coach:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) కోసం ఇప్పటి నుంచి 10 ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. వచ్చే టోర్నమెంట్ నేపథ్యంలో ఈ ఏడాది చివరలో మెగా వేలం కూడా జరగనుంది. ఇలాంటి క్రమంలో చాలా మంది ప్లేయర్లు జట్లు మారే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వేలంలోకి కూడా వస్తారు. అయితే మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎవరిని తీసుకోవాలి? ఎవరిని వదులు కోవాలి ? ట్రేడ్ ద్వారా ఎవరిని తీసుకుంటే మంచిది? అనే దాని పైన కసరత్తులు ప్రారంభించాయి 10 ఫ్రాంచైజీలు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ( Kavya Maran).. మరింత అడ్వాన్స్ గా ఆలోచిస్తూ సరికొత్త వ్యూహ రచనలు చేస్తున్నారు.

7 నుంచి 8 మంది ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేయ‌నున్న కావ్య ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament)  నేపథ్యంలో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో కావ్య ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే లివింగ్ స్టోన్ , పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ లాంటి బడా ప్లేయర్లను వదిలేసి… కొత్త స్టార్ లను తీసుకునేందుకు ఆమె ఇప్పటికే సిద్ధమయ్యారట. దాదాపు 7 నుంచి 8 మంది ప్లేయర్లను వదిలేసి… కొత్త వాళ్లకు ఛాన్స్ లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను తీసుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తో కూడా ట్రేడ్ డీల్ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

గౌతమ్ గంభీర్ తో భారీ డీలింగ్ కుదుర్చుకున్న కావ్య

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఒకప్పుడు ప్లేయర్ గా ఆ తర్వాత కోచ్ పదవులు అనుభవించిన గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir)… ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉన్నారు. 2027లో అతడి పదవి కాలం ముగియనుంది. అయితే ఈ తరుణంలోనే అతనితో ఓ కావ్య పాప భారీ డీలింగ్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 2027 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాలని గౌతమ్ గంభీర్ ను కావ్య పాప కోరినట్లు చెబుతున్నారు.

Advertisement

ఈ మేర‌కు బీసీసీఐ కంటే ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే నిజమైతే, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టైటిల్ కొట్ట‌డం గ్యారెంటీ అంటున్నారు. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) బ‌రిలోకి దిగితే, టీమిండియా సాధించిన విజ‌యాల త‌ర‌హాలోనే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా విక్ట‌రీలు న‌మోదు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ( Kavya Maran) మాస్ట‌ర్ మైండ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Tags

Related News

ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం.. ఏకంగా 12 వేల అడుగుల ఎత్తులో నిర్మాణం!

యశస్వి జైస్వాల్ ను గెలికిన‌ అసిత ఫెర్నాండో… వేలు పెట్టి మ‌రీ బూతులు తిట్టిన లంక ప్లేయ‌ర్‌

ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి..WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌

ఆ స్వెట‌ర్ల వ‌ల్లే పాకిస్తాన్ ఓట‌మి..పెద్ద సైజులు తీసుకొచ్చింద‌ని PCBపై ట్రోల్స్‌

పరేడ్ కోసం ప్ర‌ధాని ష‌రీఫ్‌, అఫ్రిది ప్లాన్‌…బెడిసికొట్టిన పాకిస్తాన్ ప్లాన్‌

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు

Big Stories

Advertisement
×