Tinder Double Date| ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ ఇటీవలే కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా స్నేహితులతో కలిసి డేటింగ్ చేయడం మరింత ఎగ్జైటింగ్ మారింది. ఈ కొత్త ఫీచర్ పేరు ‘డబుల్ డేట్’. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్ చేస్తూనే మరో జంటతో మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ డేటింగ్‌ను సరదాగా, ఒత్తిడి లేకుండా చేస్తుంది. ప్రేమ కోసం చూస్తున్నా లేక స్నేహపూర్వక సంబంధం కోసం చూస్తున్నా, ఈ ఫీచర్ స్వైప్ కల్చర్‌కు కొత్త రుచిని జోడిస్తుంది.
డబుల్ డేట్ ఎలా పనిచేస్తుంది?
డబుల్ డేట్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. టిండర్ యాప్‌లో మొదటి స్క్రీన్‌లో కుడి పైభాగంలో డబుల్ డేట్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి, మీరు ముగ్గురు స్నేహితులను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత, ఇతర జంటల ప్రొఫైల్స్‌ను చూడటానికి వీలుంటుంది. ఒక జంటతో మ్యాచ్ అయిన తర్వాత, రెండు జంటలూ కలిసి చాట్ చేయవచ్చు. ఆ తర్వాత, గ్రూప్‌గా కలిసే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఒంటరి డేటింగ్‌కు భిన్నంగా, స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి అవకాశం కల్పిస్తుంది.
టిండర్ గతంలో కూడా కొన్ని సోషల్ ఫీచర్లను పరిచయం చేసింది. ఉదాహరణకు.. ‘మ్యాచ్‌మేకర్’ ఫీచర్‌తో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీ మ్యాచ్‌లను చూసి సలహాలు ఇవ్వొచ్చు. అలాగే.. ‘షేర్ మై డేట్’ ఫీచర్‌తో మీ డేట్ ప్లాన్‌లను సన్నిహితులతో పంచుకోవచ్చు. డబుల్ డేట్ ఈ ఫీచర్లకు మరింత ఆకర్షణ జోడించింది.
యూత్ లో అప్పుడే పాపులార్
టిండర్ డేటా ప్రకారం.. డబుల్ డేట్ ఫీచర్ యూజర్లలో ముఖ్యంగా యూత్ లో చాలా ఆదరణ పొందుతోంది. 2025లో జరిగిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి.
మహిళలు ఒంటరిగా డేటింగ్ చేసే దానికంటే డబుల్ డేట్‌లో మూడు రెట్లు ఎక్కువగా ప్రొఫైల్స్‌ను లైక్ చేశారు.
ఒకరితో ఒకరు చాట్ చేసే దానికంటే డబుల్ డేట్ చాట్‌లలో 35 శాతం ఎక్కువ మెసేజ్‌లు పంపబడ్డాయి.
ఈ ఫీచర్ కారణంగా కొత్త, పాత యూజర్ల సంఖ్య 15 శాతం పెరిగింది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించిన వారిలో దాదాపు 90 శాతం మంది 29 ఏళ్లలోపు వయసు ఉన్నవారే, అంటే జెన్ జీ (Gen Z)లో ఈ ఫీచర్ బాగా ఆకర్షిస్తోంది.
ఎక్కడ అందుబాటులో ఉంది?
డబుల్ డేట్ ఫీచర్ ప్రస్తుతం అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. 2025 జూలై నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని టిండర్ తెలిపింది. టిండర్ ఇటీవల హైట్ ఫిల్టర్ ఫీచర్‌ను కూడా జోడించింది, దీంతో యూజర్లు తమ మ్యాచ్‌ల (ఫెండ్ లేదా డేటింగ్ పార్ట్ నర్) ఎత్తు ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు.
Also Read: గూగుల్ ఏఐ మోడ్‌తో వెబ్‌సైట్లకు చాలా ప్రమాదకరం.. నిపుణుల వార్నింగ్
డబుల్ డేట్‌తో.. టిండర్ స్వైపింగ్‌ను సామాజిక సాహసంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్నేహితుడితో కలిసి సరైన మ్యాచ్‌ను కనుగొనడం ఇప్పుడు మరింత సరదాగా ఉంటుంది!