OTT Movie : హైదరాబాద్‌లో ఒక రోజు ,దివ్య అనే 24 ఏళ్ల యువతి తన భర్త జయరామ్ (రవి వర్మ)తో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఈ ఘటనలో ఏదో తేడాగా ఉందని పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అనుమానిస్తాడు. ఒక సాధారణ ఆత్మహత్య కేసు కాస్తా హత్య కేసుగా మారుతుంది. నిజాలు వెలికి తీసేందుకు విక్రమ్ చేసే పరిశోధనలో ఒక్కొక్కటిగా రహాస్యాలు బయటపడతాయి. ఇంతకీ దివ్య ఎలా చనిపోయింది ? విక్రమ్ వెలుగులోకి తెచ్చే నిజాలు ఏమిటి ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
‘Blind Spot’ హైదరాబాద్‌లో జరిగే ఒక క్రైమ్ మిస్టరీ కథ. జయరామ్ అనే ఒక వ్యాపారవేత్త, తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఒక రోజు వీళ్ళ గొడవ తారా స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇంటి పనిమనిషి సరస్వతి పోలీసులకు సమాచారం అందిస్తుంది. ఈ కేసును పరిశోధించేందుకు ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. విక్రమ్‌కు దివ్య మరణం ఆత్మ హత్య కాదని భావిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని నిర్ధారణ అవుతుంది.
విక్రమ్ దర్యాప్తు జయరామ్, అతని సవతి పిల్లలు, సరస్వతి, జయరామ్ సోదరుడైన ఎన్‌ఐఏ ఆఫీసర్ (అలీ రెజా) చుట్టూ తిరుగుతుంది. ప్రతి పాత్ర వెనుక ఏవో రహస్యాలు ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానంగా ఉంటుంది. ఈ క్రమంలో విక్రమ్‌కు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి తెస్తాడు. పనిమనిషికి, జయరామ్ కి మధ్య ఎఫైర్ నడుస్తుంటుంది. చివరికి దివ్య మానసిక స్థితి ఏమిటి? ఆమె మరణానికి నిజమైన కారణం ఏమిటి? విక్రమ్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? సినిమా ఈ ప్రశ్నల చుట్టూ ఒక ఉత్కంఠభరతంగా సాగుతుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒళ్లు గగుర్పొడిచేలా మరణాలు… వెంట్రుక వాసి తప్పుతో గాల్లోకి ప్రాణాలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Blind Spot’ 2025 లో వచ్చిన ఈ సినిమాకి రాకేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ చంద్ర, రాశి సింగ్, రవి వర్మ, అలీ రెజా, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 31 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.7/10 రేటింగ్ ఉంది. 2025 మే 9న థియేట్రికల్ రిలీజ్ అవ్వగా జూన్ 13 నుంచి Amazon Prime Video లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.