E-Paper
Advertisement

Upcoming Samsung Smartphones 2026: న్యూయర్‌కి రాబోతున్న శామ్‌సంగ్ గేమ్ చెంజర్ ఫోన్‌లు.. టాప్ 10 పూర్తి వివరాలు

Upcoming Samsung Smartphones 2026: న్యూయర్‌కి రాబోతున్న శామ్‌సంగ్ గేమ్ చెంజర్ ఫోన్‌లు.. టాప్ 10 పూర్తి వివరాలు

Upcoming Samsung Smartphones 2026: శామ్‌సంగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నమ్మకానికి గుర్తుగా నిలుస్తోంది. డిస్‌ప్లే క్వాలిటీ, కెమెరా టెక్నాలజీ, పర్‌ఫార్మెన్స్ విషయంలో శామ్‌సంగ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది. 2026లో ఈ బ్రాండ్ నుంచి ఫ్లాగ్‌షిప్ ఎస్ సిరీస్, ఫోల్డబుల్ జెడ్ సిరీస్, మిడ్ రేంజ్ ఏ సిరీస్, బ్యాటరీ ఫోకస్ చేసిన ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్‌లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ వీడియోలో 2026లో లాంచ్ అవబోయే టాప్ 10 శాంసంగ్ ఫోన్‌లు ఏవి, వాటి అంచనా ధర ఎంత, ఎవరికే ఫోన్ సరిపోతుంది అన్న అంశాలను క్లియర్‌గా చూద్దాం.

Samsung Galaxy S26 Ultra 5G – ధర 1,05,000

ఈ లిస్ట్ టాప్‌లో ఉన్న ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా 5జీ. ఇది 2026 జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూపాయలు 1,05,000 నుంచి 1,25,000 మధ్య ఉండొచ్చని అంచనా. డైనమిక్ అమోల్డ్ 2x 144Hz డిస్‌ప్లే, నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, అడ్వాన్స్‌డ్ క్వాడ్ కెమెరా సెటప్, ఇంప్రూవ్డ్ ఎస్ పెన్ సపోర్ట్, భారీ బ్యాటరీ, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ, టాప్ లెవెల్ పర్‌‌ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

Samsung Galaxy S26 Plus 5G- ధర 85,000

దీనికంటే కాస్త తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వాళ్ల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ 5జీ రాబోతోంది. 2026లో లాంచ్ అయ్యే ఈ ఫోన్ ధర సుమారు రూపాయలు 85,000 నుంచి రూపాయలు 95,000 మధ్య ఉండొచ్చని టాక్. హై రిఫ్రెష్ రేట్ అమోలేడ్ డిస్‌ప్లే, ఎస్ 26 అల్ట్రా లాగే పర్‌ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్, కొంచెం టోన్‌డౌన్ కెమెరా, బ్యాలెన్స్‌డ్ బ్యాటరీ ఎఫిషియెన్సీ, స్లిమ్ ఎలిగెంట్ డిజైన్ ఈ ఫోన్ హైలైట్స్. అల్ట్రా ధర వద్దు అనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్.

Samsung Galaxy S26 5G- ధర 70,000

కాంపాక్ట్ ఫోన్ లవర్స్ కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 5జీ రాబోతోంది. ఎర్లీ 2026లో లాంచ్ అయ్యే ఈ మోడల్ ధర సుమారు రూపాయలు 70,000 నుంచి రూపాయలు 78,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. లైట్‌వెయిట్ బాడీ, పవర్‌ఫుల్ ప్రైమరీ కెమెరా, హై బ్రైట్‌నెస్ అమోలేడ్ స్క్రీన్, అప్‌డేటెడ్ ఆండ్రాయిడ్, వన్ యూఐ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫోన్‌లో కనిపిస్తాయి. చిన్న సైజ్ ఫోన్ కావాలి అనుకునే ఫ్లాగ్‌షిప్ యూజర్లకు ఇది సరైన ఎంపిక.

Samsung Galaxy Z Fold 8 2026 – ధర 1,50,000

ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 2026 మిడ్ నుంచి లేట్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూపాయలు 1,50,000 పైగా ఉండొచ్చు. ఇన్నర్ ఫోల్డబుల్ డిస్‌ప్లేలో క్రీజ్ తగ్గించే కొత్త టెక్నాలజీ, పెద్ద అవుటర్ డిస్‌ప్లే, మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్‌మెంట్‌లు, స్ట్రాంగ్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఈ ఫోన్ మెయిన్ స్ట్రెంత్. బిజినెస్ యూజర్లు, ప్రీమియం టెక్ లవర్స్ కోసం ఇదొక స్టేటస్ ఫోన్.

Samsung Galaxy Z Flip 8 – ధర 95,000

స్టైల్ ప్రిఫర్ చేసే వాళ్ల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కూడా 2026 మిడ్‌లో రానుంది. ధర సుమారు రూపాయలు 95,000 నుంచి రూపాయలు 1,10,000 వరకు ఉండొచ్చు. కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్, అప్‌డేటెడ్ కవర్ డిస్‌ప్లే, మెరుగైన హింజ్ నిర్మాణం, కలర్‌ఫుల్ స్టైలిష్ లుక్ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణలు.

Also Read: Smartphones Launching in Jan 2026: జనవరి 2026లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరతో మైండ్-బ్లోయింగ్ ఫీచర్లు

Samsung Galaxy A86 5G – ధర 32,000

మిడ్ రేంజ్‌లో స్టైలిష్ ఫీల్ కావాలనుకునే వాళ్ల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 86 5జీ 2026 ఫస్ట్ హాఫ్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ధర రూపాయలు 32,000 నుంచి రూపాయలు 38,000 మధ్య ఉండొచ్చు. హై రిజల్యూషన్ కెమెరా, అమోల్డ్ డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్, స్లిమ్ ప్రీమియం ఫినిష్ ఈ ఫోన్‌లో ఉంటాయి.

Samsung Galaxy A76 5G – ధర 25,000

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 76 5జీ 2026 మిడ్‌లో రానుంది. ధర రూపాయలు 25,000 నుంచి రూపాయలు 32,000 మధ్య ఉండే అవకాశం ఉంది. డే టు డే యూజ్‌కు సరిపడే ప్రాసెసర్, డేలైట్ కెమెరా పర్‌ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత.

Samsung Galaxy A36 5G Late – ధర 18,000

బడ్జెట్ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 36 5జీ లేట్ 2026లో లాంచ్ కావచ్చు. ధర రూపాయలు 18,000 నుంచి రూపాయలు 24,000 మధ్య ఉండొచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్, 5జీ సపోర్ట్, లైట్‌వెయిట్ డిజైన్ రోజు రోజుకి యూజ్ చేసే వారికి ఉపయోగపడతాయి.

Samsung Galaxy M66 5G Early -ధర 16,000

బ్యాటరీ లైఫ్ ఎక్కువగా కావాలనుకునే వాళ్లకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 66 5జీ ఎర్లీ 2026లో రానుంది. ధర రూపాయలు 16,000 నుంచి రూపాయలు 22,000 మధ్య ఉండొచ్చు. పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, డీసెంట్ డే లి పర్‌ఫార్మెన్స్ ఈ ఫోన్ హైలైట్.

Samsung Galaxy F66 5G – ధర 15,000

వాల్యూ ఫోకస్ చేసుకునే స్టూడెంట్స్ కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 66 5జీ 2026 మిడ్‌లో లాంచ్ అవుతుందని అంచనా. ధర రూపాయలు 15,000 నుంచి రూపాయలు 20,000 మధ్య ఉండొచ్చు. 5జీ కనెక్టివిటీ, స్మూత్ డిస్‌ప్లే, సింపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ బలాలు.

బెస్ట్ ఏది అంటే?

2026లో శామ్‌సంగ్ ఫోన్ ఎంపిక చేసుకునేటప్పుడు అమోలేడ్ డిస్‌ప్లే, కనీసం 120Hz రిఫ్రెష్ రేట్, స్టేబుల్ ప్రాసెసర్, ఓఐఎస్ ఉన్న కెమెరా, 5000mah బ్యాటరీ ఉంటే డైలీ యూజ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అవసరానికి మించి ఖర్చు చేయకుండా మీ బడ్జెట్‌కు సరిపడే మోడల్ ఎంచుకుంటే అదే బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇవే 2026లో రాబోయే టాప్ 10 శామ్‌సంగ్ ఫోన్‌లు. మీ అవసరానికి ఏ ఫోన్ బెస్ట్ మీరు చూడండి.

Related News

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

Big Stories

×