Nandamuri Balakrishna : కొన్ని సందర్భాల్లో సినిమాలు విషయంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి అనుకునే తరుణంలో అఖండ 2 సినిమా క్యాన్సిల్ అవడం అనేది ఒక ఊహించని పరిణామం. అప్పటికే టికెట్లు కూడా కొన్ని చోట్ల బుక్ అయిపోయాయి. అయితే అంత పెద్ద సినిమాకి కూడా ఆర్థిక లావాదేవీలు ప్రాబ్లం రావడం అనేది షాకింగ్.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆరోస్ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ సమస్త కు మధ్య దూకుడు సినిమా అప్పటి నుంచే కొంచెం ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అయితే అప్పటినుంచి క్లియర్ కానీ కొన్ని డ్యూస్ ను ఈ సినిమా అప్పుడు కరెక్ట్ గా లాక్ చేసి అడిగారు. అందుకే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కూడా వాయిదా అయిపోయింది. అయితే లోకల్ ఫైనాన్షియర్ లో కూడా కొంత శాతం వరకు క్లియర్ చేయాల్సి ఉంది. అవి కూడా సక్సెస్ఫుల్ గా క్లియర్ చేశారు.
మామూలుగా ఒక హీరోతో సినిమా చేయాలి అంటే ప్రొడ్యూసర్ ఆ హీరోకి ఒక మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి, అలానే వాళ్లను డేట్స్ కోసం రిక్వెస్ట్ చేసుకొని చాలా ప్రయాసలు పడిన తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుంది. అయితే ఈ ప్రాసెస్ లో నిర్మాత కోసం సహకరించే హీరోలు ఉండటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది.
ఇక అఖండ 2 సినిమాకి వచ్చిన ఇబ్బందులు చూసి హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను చర్య ఏడు కోట్ల రూపాయల చెక్కు ను రిటర్న్ గా నిర్మాతలకు ఇచ్చారు. వీళ్లు చేసిన ఈ పని చాలా మంది నిర్మాతలకు ఒక ఊరట ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే ఇలాంటి సాయం చేయడం వలన నిర్మాతలకు కూడా కొంత ధైర్యం వస్తుంది.
కేవలం సినిమాల్లోనే ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోలు అని కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిర్మాతను ఆదుకునే హీరోలు అని కూడా ఈ సంఘటనతో అర్థమవుతుంది. ఇక సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత అన్ని క్లియర్ అవుతాయి కానీ. ఈ టైంలో నమ్మి నిలబడటం సినిమాను రిలీజ్ కి తోడ్పడటం అనేది హర్షించదగ్గ విషయం.
డిసెంబర్ 5న విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా తరువాత ఎప్పుడొస్తుందా అనే క్లారిటీ ఎవరికి లేకుండా పోయింది. మొత్తానికి ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలు రేపటి నుంచే మొదలుకానున్నాయి. అఖండ 2 తాండవం రేపు థియేటర్స్ లో మొదలుకానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ సాధించాయి. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read : Karthi: రెస్టారెంట్స్ లో కార్తీ ఖైదీ సినిమా పోస్టర్లు, కార్తీ ఏమన్నాడంటే?