Best air fryers with auto shut off: ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారం కోసం.. ఆయిల్ ఫ్రీ కుకింగ్ వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. దీని కోసం మార్కెట్లో ఎయిర్ ఫ్రైయర్ల డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. అయితే.. గంటల తరబడి కిచెన్ లో ఉండి, ఫుడ్ మాడిపోతుందేమోనని టెన్షన్ పడే రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్లో.. లభిస్తున్న మోడ్రన్ ఎయిర్ ఫ్రైయర్లలో ‘ఆటో-షట్ ఆఫ్’ఫీచర్ వస్తోంది. అంటే టైమర్ పూర్తి కాగానే మిషన్ దానంతట అదే ఆఫ్ అవుతుంది. దీని వల్ల ఫుడ్ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. అంతే కాకుండా కరెంట్ ఆదా అవుతుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఫిలిప్స్, హయర్ వంటి టాప్ బ్రాండ్లలో దొరికే.. బెస్ట్ 5 ఎయిర్ ఫ్రైయర్స్ వివరాలు చూద్దాం.
ఎయిర్ ఫ్రైయర్ అనగానే.. టక్కున గుర్తుకొచ్చే పేరు ఫిలిప్స్. దీని లోని రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఫుడ్‌ను క్రిస్పీగా మారుస్తుంది. ఇందులో ఉన్న ఆటో-షట్ ఆఫ్ ఫీచర్ వంట పూర్తవగానే.. బీప్ సౌండ్ చేసి మరీ ఆటో మేటిక్‌గా ఆఫ్ అవుతుంది. టచ్ స్క్రీన్ ప్యానెల్ అంతే కాకుండా ప్రీ-సెట్ ఆప్షన్లు దీనిని వాడటం చాలా ఈజీ చేస్తాయి.
స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ లో హయర్ మంచి పేరు సంపాదించుకుంది. హయర్ ఎయిర్ ఫ్రైయర్లు స్టైలిష్ లుక్‌తో పాటు పవర్ ఫుల్ హీటింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఇందులో.. సేఫ్టీ ప్రొటెక్షన్ భాగంగా ఆటోమేటిక్ షట్-డౌన్ ఫీచర్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా బాస్కెట్ బయటికి తీసినా లేదా టైమర్ పూరైన ఇది వెంటనే ఆగిపోతుంది.
బడ్జెట్ ధరలో.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇనాసా బెస్ట్ ఛాయిస్. ఇది స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్, ఆటో-షట్ ఆఫ్ ఫీచర్‌తో వస్తుంది. వంట చేసే సమయంలో.. ఓవర్ హీటింగ్ కాకుండా ఇది జాగ్రత్త పడుతుంది. తద్వారా ఫుడ్ మాడిపోయే అవకాశమే ఉండదు.
హెల్దీ కుకింగ్‌ను ఇష్ట పడే యంగ్ జనరేషన్.. కోసం నూట్రినిబాక్స్ ఎయిర్ ఫ్రైయర్లు.. ట్రెండ్‌లో ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, ఈజీ క్లీనింగ్ బాస్కెట్‌తో.. పాటు పర్ఫెక్ట్ టైమర్ కంట్రోల్ ఇందులో ఉంటుంది. టైమ్ అయిపోగానే ఇది ఆటోమేటిక్‌గా పవర్ కట్ చేసుకుంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు.
Also Read: రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!
ఇండియన్ వంటకాలకు తగినట్లుగా డిజైన్ చేసిన ఈ బ్రాండ్లు కూడా ఆటో-షట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్‌ను అందిస్తున్నాయి. పీసెస్ ఈవెన్‌గా ఫ్రై అవడానికి, సేప్ గా వంటకాల తయరీ కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
కిచెన్ లో మీ సమయాన్ని ఆదా చేస్తూ, వంట మాడిపోకుండా ఉంచే.. ఈ ఆటో-షట్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్లు ప్రతి ఇంటి అవసరమే. మీ బడ్జెట్ , అవసరాలకు తగిన బ్రాండ్‌ను ఎంచుకుని హెల్దీ ఫుడ్‌ను ఎంజాయ్ చేయండి!