E-Paper
Advertisement

మెజిస్టిక్.. కర్ణాటకలో తెలుగు సినిమాలు మాత్రమే ఆడే ఆ థియేటర్‌ను ఎందుకు కూల్చేశారు?

మెజిస్టిక్.. కర్ణాటకలో తెలుగు సినిమాలు మాత్రమే ఆడే ఆ థియేటర్‌ను ఎందుకు కూల్చేశారు?
Advertisement

History of Bangalore Majestic Theater: మెజిస్టిక్.. బెంగళూరులోని ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కెంపేగౌడ బస్ స్టేషన్‌ను ‘మెజిస్టిక్’ అనే పిలుస్తుంటారు. అయితే, అక్కడి తెలుగు ప్రజలకు మాత్రం.. అది ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్ అడ్డా. ఎందుకంటే.. అక్కడ ఉన్న మెజిస్టిక్ థియేటర్‌లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ చేసేవారు. కొత్త సినిమా రిలీజ్‌లు ఉన్నా, పండుగలు వచ్చినా.. ఆ ప్రాంతమంతా తెలుగువారితో కిటకిటలాడేది. ఆ థియేటర్ అక్కడ ఒక ల్యాండ్ మార్క్‌గా మారిపోయింది. ఫలితంగా ఆ ప్రాంతానికి ‘మెజిస్టిక్’ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ థియేటర్ అక్కడ లేకపోయినా సరే.. ఆ ప్రాంతాన్ని ‘మెజిస్టిక్’ అనే పిలుస్తారు.

ఈ థియేటర్ ఎక్కడ ఉండేది?

బెంగళూరులోని గాంధీనగర్, కేజీ రోడ్డు సినిమా థియేటర్లకు ప్రసిద్ధి. వాటిలో ‘మెజిస్టిక్’ థియేటర్ చాలా ప్రత్యేకమైనది. ఈ థియేటర్ కర్ణాటకలోనే తెలుగు సినిమా ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. బెంగళూరులో తెలుగు మాట్లాడే ప్రజలకు.. ఇది కేరాఫ్ అడ్రెస్. ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలం నుంచి కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు ప్రతి ఒక్కరి సినిమాలు ఇక్కడ విడుదలయ్యేవి. అంతేకాదు.. 100 రోజుల ఫంక్షన్లు కూడా జరిగేవి. సంక్రాంతి, దసరా పండుగలు వస్తే చాలు.. కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పుల వ్యాయిద్యాలతో గాంధీనగర్ వీధులన్నీ టాలీవుడ్ అభిమానులతో మారుమోగివి.

మెజిస్టిక్.. ఎప్పటికీ చెరగని చిరునామా

Advertisement

ఈ థియేటర్‌కు వచ్చిన ప్రాచుర్యం వల్ల.. దానికి సమీపంలో ఉన్న ప్రధాన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను కూడా మెజిస్టిక్ అనే పేరు స్థిరపడిపోయింది. అయితే, కాలక్రమేనా ఆ థియేటర్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన తగిపోవడం, కన్నడ సినిమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం పెరిగింది. ఆ తర్వాత మల్లిప్లెక్స్ థియేటర్లత రాకతో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు క్రమేనా ఆధరణ తగ్గిపోయింది. థియేటర్ నిర్వహణ ఖర్చులు పెరగడం, టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో యాజమాన్యం దీన్ని మూసివేసింది. చివిరికి కూల్చివేసింది. కానీ, ఆ థియేటర్ పేరు మాత్రం అలాగే చెలామణిలో ఉంది.

ఇప్పుడు అక్కడ ఏం ఉంది?

ఆ థియేటర్ కూల్చివేసిన తర్వాత కొన్నాళ్లు ఆ స్థలం ఖాళీగానే ఉంది. అయితే, ప్రధాన వాణిజ్య కేంద్రం కావడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భారీ షాపింగ్, బిజినెస్ కాంప్లెక్స్‌లను నిర్మించింది. హోల్ సేల్ బట్టల మార్కెట్లు, ఎలక్ట్రానిక్ షాపులు వెలిశాయి. ఈ ప్రాంతం ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ హబ్‌గా మారింది. ప్రస్తుతం ‘మెజిస్టిక్’ ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద రవాణా కేంద్రాల్లో ఒకటి. ఇక్కడే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్, కెంపేగౌడ్ బస్ స్టేషన్ ఉండటంతో నిత్యం పర్యటకులు, ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

Advertisement

Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

నాదప్రభు కెంపేగౌడ మెట్రో స్టేషన్‌ను కూడా ఈ ప్రాంతానికి కనెక్ట్ చేశారు. అయితే, మెట్రో స్టేషన్‌కు మాత్రం ‘మెజిస్టిక్’ పేరు పెట్టలేదు. దీనికే కాదు అక్కడ ఏ ప్రాంతానికి మెజిస్టిక్ పేరు ఉండదు. కానీ జనాలు మాత్రం ఆ పేరుతోనే పిలుస్తుంటారు. మెజిస్టిక్ థియేటర్ ఇక్కడ భౌతికంగా లేకపోయినా.. నాటి తరం తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో, బెంగళూరు చరిత్ర పుటల్లో దాని జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే.

Tags

Related News

గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

తిరుమల శ్రీవారి ‘పుష్పయాగం’ టికెట్ల బుకింగ్స్ మొదలు, ఒక్కరోజే ఛాన్స్!

రైళ్లలో ఫుడ్ ఎందుకు రుచిగా ఉండదు? ప్రయాణికులు ఎందుకు దూరం అవుతున్నారు?

కోల్ వేస్ట్ తో చెక్కు చెదరని రోడ్లు నిర్మాణం.. NIT రూర్కెలా సంచలన ఆవిష్కరణ!

IRCTC మొదలైంది అప్పుడే.. ఆ రోజు ఎన్ని టికెట్లు ఆన్‌లైన్లో బుక్ అయ్యాయో తెలుసా?

Big Stories

Advertisement
×