Hyderabad Passport Mela 2026: పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా నవంబర్ 3 అంటే మంగళవారం 4 వేల అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్పీవో వెల్లడించింది.
హైదరాబాద్‌లో పాస్‌పోర్టు పొందాలంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే ఇప్పటికే అప్లై చేసుకున్నవారి సంఖ్య చాలా ఉంది. దీంతో ఎప్పుడు క్లియర్ అవుతుందా? అని పాస్టుపోర్టు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫారెన్‌కు వెళ్లాల్సినవారు కొందరైతే, ఎడ్యుకేషన్ కోసం వెళ్లేవారు ఇంకొందరు. అక్కడ ఉండే తమ పిల్లల వద్దకు వెళ్లేవారు ఇంకొందరు ఉన్నారు. ఈ క్రమంలో వారికి తీసి కబురు చెప్పింది హైదరాబాద్ లోని రీజినల్ పాస్టుపోర్టు ఆఫీసు.
నవంబర్ 21న పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అప్లై చేసుకున్నవారికి వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు పాస్‌పోర్ట్ మేళా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ మూడు నుంచి అంటే మంగళవారం 4 వేల స్లాట్‌లు విడుదల చేస్తునట్టు ప్రకటన చేసింది. అందులో నార్మల్, తత్కాల్ పాస్‌పోర్ట్, PCC సేవల(పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్)కు సంబంధించిన స్లాట్‌లు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, అపాయింట్‌మెంట్లు విడుదల చేస్తోంది.
పాస్ట్‌పోర్టు మేళాకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలను భావించే యువతీ యువకులు తమ అపాయింట్‌మెంట్ల కోసం జాతీయ హెల్ప్‌లైన్: 1800-258-1800 సంప్రదించవచ్చు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం-RPO: 040-27715333 / 27715115 / 27806657 సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు నేరుగా mPassport Seva యాప్‌ను ఉపయోగించవచ్చు.
ALSO READ: హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ మేళా.. మంగళవారం నుంచి స్లాట్ విడుదల, ఇంకెందుకు ఆలస్యం