E-Paper
Advertisement

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న.. బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ల లిస్ట్!

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న.. బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ల లిస్ట్!
Advertisement

Best Microwave Ovens 2026: ప్రస్తుత రోజుల్లో వంట గదిలో స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వంట పనిని వేగంగా, ఈజీగా ముగించడంలో మైక్రోవేవ్ ఓవెన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంట్లోనే టేస్టీ కేకులు బేక్ చేయాలన్నా.. లేదా ఫ్రీజర్ లో గడ్డకట్టిన చికెన్, మటన్ లాంటి మాంసాన్ని త్వరగా సాధారణ స్థితికి (డీఫ్రాస్ట్) తీసుకురావాలన్నా మంచి కన్వెక్షన్ ఓవెన్ ఉండాలి. మార్కెట్లో క్రేజ్ ఉన్న టాప్ 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ల ఫీచర్లు, వాటి ప్రస్తుత ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. LG 28 L Convection Microwave Oven):
మార్కెట్లో హోం అప్లయన్సెస్ రంగంలో ఎల్‌జీ బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ 28 లీటర్ల మోడల్ మధ్యస్థ,పెద్ద కుటుంబాలకు చాలా బాగా సరిపోతుంది. ఇందులో స్టెయిన్ లెస్ స్టీల్ క్యావిటీ ఉండటం వల్ల వేడి సమానంగా వ్యాపించి కేకులు పర్ఫెక్ట్‌గా బేక్ అవుతాయి. నాన్-వెజ్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేకమైన ఆటో డీఫ్రాస్ట్ ఫీచర్ ఉంది. ఇది నాన్ వెజ్‌ను చాలా వేగంగా నార్మల్ టెంపరేచర్‌కు తెస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.15,990 నుంచి రూ.16,500 వరకు ఉంటుంది.

Advertisement

2. Samsung 28 L Convection Microwave Oven:
సామ్‌సంగ్ కంపెనీ ఎల్లప్పుడూ ట్రెండీ లుక్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఉత్పత్తులను అందిస్తుంది. ఈ ఓవెన్‌లో ఉన్న ‘స్లిమ్ ఫ్రై’ టెక్నాలజీ వల్ల చాలా తక్కువ నూనెతో డీప్ ఫ్రై లాంటి వంటకాలు చేసుకోవచ్చు. ఇందులోని సిరామిక్ ఎనామిల్ క్యావిటీ వల్ల ఓవెన్ లోపలి భాగం సులువుగా క్లీన్ అవుతుంది. అంతే కాకుండా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. పవర్ డీఫ్రాస్ట్, టాండూర్ టెక్నాలజీ దీని అదనపు ఆకర్షణలు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.15,590 నుంచి రూ. 17,690 వరకు అందుబాటులో ఉంది.

3. IFB 30 L Convection Microwave Oven:
మీరు పెద్ద మొత్తంలో బేకింగ్ చేయాలనుకుంటే.. లేదా పెద్ద ఫ్యామిలీ అయితే ఐఎఫ్బీ 30 లీటర్ల ఓవెన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. దీనిలో.. మల్టీ-స్టేజ్ కుకింగ్ ఫీచర్ ఉంటుంది. దీని సహాయంతో ఒకే సారి డీఫ్రాస్ట్, బేకింగ్ సైకిల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ కుకింగ్ ఫీచర్ ద్వారా తక్కువ సమయంలోనే.. వంట పూర్తవుతుంది. నాణ్యత, మన్నికకు ఈ బ్రాండ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.16,990 నుంచి రూ. 18,490 వరకు ఉంటుంది.

Advertisement

4. Panasonic 27 L Convection Microwave Oven:
జపనీస్ టెక్నాలజీతో వచ్చే పానాసోనిక్ ఓవెన్ చాలా తక్కువ కరెంట్ వాడకంతో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే 360 డిగ్రీ హీట్ ర్యాప్ టెక్నాలజీ వల్ల కేకులు, బిస్కెట్లు పైన మాడిపోకుండా.. లోపల చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇందులోని మ్యాజిక్ గ్రిల్ ఫీచర్ చికెన్, ఫిష్ గ్రిల్లింగ్‌కు, మీట్ డీఫ్రాస్టింగ్‌కు అద్భుతంగా సాయ పడుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.14,290 నుంచి15,490 వరకు అందుబాటులో ఉంది.

Also Read: రూ.1,500 లోపే బెస్ట్ స్మార్ట్‌వాచ్.. బోట్ ఎక్స్‌టెండ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5. Godrej 25 L Convection Microwave Oven:
తక్కువ బడ్జెట్‌లో కన్వెక్షన్ ఓవెన్ కొనాలనుకునే వారికి గోద్రెజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది సైజులో కాంపాక్ట్‌గా ఉంటూనే, కిచెన్‌లో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బేకింగ్, గ్రిల్లింగ్ , క్విక్ డీఫ్రాస్ట్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల భద్రత కోసం ఇందులో చైల్డ్ లాక్ ఫీచర్ కూడా అందించారు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.11,990 నుంచి రూ.13,290 వరకు చాలా రీజనబుల్ గా ఉంటుంది.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఆన్‌లైన్ సైట్లు, పండగల ఆఫర్లు , బ్యాంక్ డిస్కౌంట్లను బట్టి మారే అవకాశం ఉంది. కేకులు పర్ఫెక్ట్‌గా బేక్ అవ్వాలంటే ఎల్లప్పుడూ కన్వెక్షన్మోడ్ ఉన్న ఓవెన్లను మాత్రమే ఎంచుకోవాలి. కేవలం సోలో ఓవెన్లలో బేకింగ్ సరిగ్గా రాదు.

Related News

లాగ్స్ లేవు.. స్లో అవ్వవు.. సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్‌ఎస్‌డీ లాప్‌టాప్స్!

ఐరన్ బాక్స్‌లకు గుడ్ బై..బట్టల ముడతలను చిటికెలో పోగొట్టే 5 బెస్ట్ గార్మెంట్ స్టీమర్స్!

చిన్న ఫ్లాట్స్ కోసం బెస్ట్ టూ-ఇన్-వన్ వాషింగ్ మెషీన్లు.. ఫీచర్లు ఇవే!

కరెంట్ బిల్లు తక్కువ.. కూలింగ్ ఎక్కువ.. టాప్ 5 పర్సనల్ కూలర్ల లిస్ట్!

పెద్దలకు ఉపయోగపడే.. అద్భుతమైన బ్లూటూత్ డివైజ్‌లు.. ఇక ఎవరిపై ఆధారపడక్కర్లేదు!

స్మార్ట్‌ఫోన్లలో ‘రిమూవబుల్ బ్యాటరీలు’ ఎందుకు మాయమయ్యాయి? అసలు రహస్యం ఇదే!

పవర్‌ఫుల్ బ్యాటరీ, మతిపోయే AI ఫీచర్లు.. రూ.30 వేలలో మోస్ట్ వాంటెడ్ ఫోన్స్!

Big Stories

Advertisement
×