Portable Projectors: ఈ రోజుల్లో పోర్టబుల్ ప్రొజెక్టర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలనుకునేవారు.. పెద్ద ఎత్తున వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే విహారాలకు వెళ్లినప్పుడు.. పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూడటానికి కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అధునాతన ఫీచర్లతో దూసుకుపోతున్న టాప్-5 పోర్టబుల్ ప్రొజెక్టర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ఎక్స్‌గిమి బ్రాండ్ కు చెందిన ఈ మోడల్.. అద్భుతమైన 4K రిజల్యూషన్‌తో రూపొందింది. 1600 ఐఎస్ఓ ల్యూమెన్స్ బ్రైట్‌నెస్, ట్రిపుల్ లేజర్ సాంకేతికతతో పగటిపూట కూడా స్పష్టమైన చిత్రాలను ఇది అందిస్తుంది. దీని ధర రూ.60 వేల వరకూ పలుకుతోంది.
కంటికి ఇంపైన రంగులు, అద్భుతమైన కాంట్రాస్ట్ ను ఇచ్చే బడ్జెట్ ప్రొజెక్టర్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఈ ప్రొజెక్టర్ 1080p ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీని ఫ్లిప్ డిజైన్ వల్ల ప్రొజెక్టర్‌ను సులభంగా తిప్పుతూ ఇంటి సీలింగ్‌పై కూడా సినిమా స్క్రీన్‌ను ఆస్వాదించవచ్చు. దీని ధర రూ.34,999గా ఉంది.
ప్రీమియం, ప్రొఫెషనల్ రేంజ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోరుకుంటే.. ఈ ప్రొజెక్టర్ బెస్ట్ ఆప్షన్. అద్భుతమైన 5800 ఐఎస్ఓ ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ మోడల్.. 300 ఇంచుల వరకు భారీ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేస్తుంది. మోటరైజ్డ్ గింబాల్ బేస్, మాలీ 5.0 ట్రిపుల్ లేజర్ సిస్టమ్‌తో గోడపై ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ను ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని ధర ఏకంగా రూ.4.04 లక్షలుగా ఉంది.
చిన్న సైజులో ఉంటూ.. ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ప్రొజెక్టర్ కోరుకునేవారు.. దీనిని పరిశీలించవచ్చు. దీనిని ప్రత్యేకమైన బ్యాటరీతో తీసుకురావడం వల్ల.. కరెంటు పోయినప్పటికీ ఒక గంట 20 నిమిషాల పాటు నేరుగా సినిమాను చూడొచ్చు. జేబీఎల్ సౌండ్ టెక్నాలజీతో కూడిన స్పీకర్లు, ఆటో ఫోకస్ ఫీచర్లతో ఇది రానుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.40,539కు ఇది అందుబాటులో ఉంది.
Also Read: ఇంట్లో దోమలు ఉన్నాయా? కాయిల్స్ vs ఎలక్ట్రిక్ వేపరైజర్లలో.. ఏది బెస్ట్ చాయిస్?
క్యాంపింగ్‌కు వెళ్లే వారి కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 1080p రిజల్యూషన్, 400 ANSI ల్యూమెన్స్‌తో చక్కని కలర్ ఫుల్ స్క్రీన్ ను ఇది అందిస్తుంది. గూగుల్ టీవీ సపోర్ట్, సులభంగా పట్టుకోవడానికి వీలైన హ్యాండిల్ డిజైన్, అద్భుతమైన డాల్బీ ఆడియో స్పీకర్లు దీనికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీని ధర రూ.48,134గా ఉంది.
Also Read: ఇంట్లోని ఏసీ సోలార్‌పై నడవాలంటే.. ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఇదే అసలైన లెక్క!