E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది
Advertisement

One Day tournament in Multan:   పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఈ మధ్యకాలంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టేందుకు గాను.. రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ పెను సంచలనాలకు తెర లేపుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ క్లాసులు నేర్పిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… తమ ప్లేయర్లు హిట్టర్లుగా మారెందుకుగాను అమెరికాలో ట్రైనింగ్ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ పైన (2027 ODI World Cup) ఫోకస్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్… పాకిస్తాన్ సూపర్ లీగ్ తరహాలో మరో టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నద్ధమైంది. వన్డే ఫార్మాట్ లో జరిగే టోర్నమెంట్ కోసం ముల్తాన్ వేదికగా ఏర్పాట్లు చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఎలాగైనా టీమిండియాను వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో ఓడించాలన్న కసితో… ఈ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. టైటిల్ గెలిచేలా తమ పాకిస్తాన్ జట్టును సిద్ధం చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ముల్తాన్ లో వన్డే ఫార్మాట్ లో ఓ టోర్నమెంట్ (One Day tournament in Multan) నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ముల్తాన్ వేదికగా 50 ఓవర్ల టోర్నమెంట్ నిర్వహించనున్నారట. ముల్తాన్ లో వన్డే ఫార్మాట్ టోర్న‌మెంట్ ను ఆగ‌స్ట్ 11వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ టోర్నమెంట్ మొత్తం ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగానే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. భవిష్యత్తులో ఆసియా కప్ 2027, వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లు 50 ఓవర్ల ఫార్మాట్ లో జరగనున్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పటిష్టంగా రాణించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారట. పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాలుగు భాగాలుగా విభజించి.. ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు అంట. ఈ టోర్నమెంట్ నిర్వహించి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆత్మస్థైర్యం నింపనున్నారట. వన్డే ఫార్మాట్ లో ప్లేయర్లు అద్భుతంగా రాణించేలా తీర్చిదిద్దనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా కుద‌ర‌క‌పోతే, ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్ నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనిపై జూలై చివ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

టీమిండియాను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా పాక్ ప్రణాళిక‌లు

ఈ వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టును బలంగా తయారు చేసి… టీమిండియాను దెబ్బ కొట్టేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్కెచ్ వేసింది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లలో టైటిల్ గెలవకపోయినా… టీమిండియాను మాత్రం ఓడించాలన్న కసితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్క్ చేస్తోంది.

 

https://www.facebook.com/crickettime360/posts/pcb-likely-to-schedule-a-four-team-one-day-tournament-in-multan-from-august-11-t/1017845971164190/

Related News

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్…పాకిస్తాన్ త‌ర‌హాలో ఫీల్డింగ్ అంటూ ట్రోల్స్‌

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు, సీనియ‌ర్ల‌ను విడ‌దీసి గంభీర్ ట్రైనింగ్ ?

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !

రోహిత్ కు 87 ఛాన్సులు ఇచ్చారు..మ‌రీ స్కూల్ కు వెళ్లే వైభ‌వ్ కు 3 మ్యాచ్ లే స‌రిపోతాయా?

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌

సంజు శాంస‌న్ కు ఘోర అవ‌మానం..న‌ల్ల‌గా ఉన్నాడంటూ ?

Big Stories

Advertisement
×