E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్
Advertisement

TRIGGR Rizz TWS earbuds:  ప్రస్తుత టెక్కీలు ,యూత్ ఎప్పుడూ స్టైలిష్‌గా ఉండే.. గాడ్జెట్స్‌ను ఇష్ట పడుతుంటారు. ముఖ్యంగా రోజు వారీ ప్రయాణాల్లో, వర్కౌట్లు చేసేటప్పుడు.. లేదా ఆఫీస్ మీటింగ్స్‌లో చక్కటి మ్యూజిక్ అందించే TWS ఇయర్‌ బడ్స్ ప్రతి ఒక్కరి అవసరంగా మారి పోయాయి. మార్కెట్లో వందల బ్రాండ్లు ఉన్నప్పటికీ.. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో TRIGGR Rizz ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆకర్షణీయమైన స్పెరికల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. స్పెరికల్ డిజైన్ & ఒనిక్స్ లీలక్ కలర్:

ఈ ఇయర్‌బడ్స్ అతిపెద్ద హైలైట్ వీటి లుక్ అండ్ డిజైన్. గుండ్రని షేప్‌లో ఉండే ఛార్జింగ్ కేస్ చూడటానికి చాలా క్యూట్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. ముఖ్యంగా దీని కలర్ వేరియంట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీన్ని పాకెట్‌లో పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎక్కడికైనా స్టైలిష్‌గా క్యారీ చేయెచ్చు.

2. 13mm డ్రైవర్లు , రిచ్ బేస్ సౌండ్:

Advertisement

చిన్న సైజులో ఉన్నప్పటికీ ఈ ఇయర్‌ బడ్స్ సౌండ్ విషయంలో.. ఎలాంటి రాజీ పడవు. వీటిలో పవర్ ఫుల్ 13mm డ్రైవర్లను అమర్చారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు రిచ్ బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ వినిపిస్తుంది. బేస్ లవర్స్ కోసం ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆప్షన్ అనే చెప్పాలి.

3. 40 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ & ఫాస్ట్ ఛార్జింగ్:

ఎక్కడికైనా ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు.. బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ ఈ ఇయర్‌ బడ్స్‌తో అసలు ఉండదు. పూర్తి ఛార్జింగ్‌పై ఇది ఏకంగా.. 40 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే.. గంటల తరబడి మ్యూజిక్ ఆస్వాదించేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీనిలో సపోర్ట్ చేస్తుంది.

4. స్మార్ట్ ఫీచర్లు, కాల్ క్వాలిటీ:

Advertisement

ఈ బడ్జెట్ రేంజ్‌లో కూడా కంపెనీ అనేక లేటెస్ట్ ఫీచర్లను అందించింది. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉండటం వల్ల రద్దీగా ఉండే ప్రదేశాల్లో.. కూడా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ,గేమింగ్ కోసం లో-లేటెన్సీ మోడ్ దీని పర్ఫామెన్స్ మరింత మెరుగు పరుస్తాయి.

5. ధర:

ఇన్నిలేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ మోడల్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రత్యేక ఆఫర్ల కింద ప్రస్తుతం కేవలం రూ. 499 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ లుక్ , లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.

కేవలం రూ. 500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రెండీ గ్యాడ్జెట్‌ను వెంటనే మీ కార్ట్‌లో యాడ్ చేసుకొని మీ మ్యూజిక్ జర్నీని ఎంజాయ్ చేయండి!

Related News

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

Big Stories

Advertisement
×