E-Paper
Advertisement

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు! సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రంతో లొంగదీసుకునే ప్రయోగం! 52 రోజుల సమ్మె.. మరణించిన కార్మికులు..!

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు! సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రంతో లొంగదీసుకునే ప్రయోగం! 52 రోజుల సమ్మె.. మరణించిన కార్మికులు..!
Advertisement

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోరు. ఆయన మంచి చేశాడని కాదు. ఆయన పాలనలో సమ్మెకాలంలో నియంతలా మారి వారి జీవితాలతో ఆడుకున్న వైనాన్ని గుర్తు చేసుకుని తిట్టుకుంటారు.

అలాంటి రోజులు మళ్లీ రావొద్దని కోరుకుంటారు. అప్పటి వరకు ఓ ఉద్యమ దళపతిగానే తెలుసు. కానీ సీఎం అయిన తరువాత గానీ తెలియలేదు ఆయనలోని ఆ నియంత పోకడలు, అణిచివేసే నిర్ణయాలు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో 2019 నాటి ఆర్టీసీ సమ్మె సంచలనాత్మకమైనదిగా నిలిచిపోయింది.

Advertisement

దాదాపు 52 రోజుల పాటు సాగిన ఈ సమ్మె, కార్మికులకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక తీవ్రమైన సంఘర్షణగా చూడాలి. ఈ సమయంలోనే కేసీఆర్‌ అసలు రూపం బయటపడింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను, అవలంభిస్తున్న తీరును చూసి యావత్‌ తెలంగాణ జాతే నివ్వెరపోయింది.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు 26 సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెను ఉక్కుపాదంతో అణిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు కేసీఆర్‌ ఆనాడు. ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెంక్కించాలంటే ప్రైవేటీకరణ చేయడమే దిక్కు అని ఎదురుదాడి మొదలు పెట్టాడు.

Advertisement

సమ్మె ప్రారంభించిన మరుసటి రోజు నుంచి సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రాన్ని ప్రయోగించాడు. నిర్దేశిత గడువులోపు విధుల్లో చేరకపోతే.. 48,000 మంది ఉద్యోగులు తమకు తామే విధుల నుంచి తొలిగిపోయినట్టు లెక్క అని తేల్చిపారేశాడు. జీతాలు నిలిపివేశాడు. ఆర్టీసీలో యూనియన్ల వ్యవస్థ వల్లే సంస్థ నష్టాల్లోకి వెళ్తోందని, తరచూ సమ్మెలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

భవిష్యత్తులో ఆర్టీసీలో ఎలాంటి యూనియన్లు ఉండబోవని, వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ నివ్వెరపోయేలా చేశాడు కేసీఆర్‌. యూనియన్ల రద్దుపై పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెంటనే వెల్ఫేర్‌ కౌన్సిల్ పేరుతో సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని ప్రతి డిపోలో వీటిని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నాడు.

ఈ సమ్మె సమయంలో కేసీఆర్ తీసుకున్న తలతిక్క నిర్ణయాలతో దాదాపు 25 నుంచి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం కూడా చోటు చేసుకుంది. అయినా కేసీఆర్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో కార్మికులే దిగి వచ్చినా మొదట బెట్టు చేశాడు. ఆ తరువాత వారిని ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి నవ్వుతూ మాట్లాడి.. అప్పటి దాకా చేసిందంతా బారాఖూన్‌ మాఫీ.. అని పంపేశాడు.

కానీ ఆ తరువాత యూనియన్ల రద్దును ఎత్తేయలేదు. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిన తరువాత గుర్తింపు ఎన్నికలను మళ్లీ యథావిధిగా కొనసాగించింది. ఇన్నాళ్లకు మళ్లీ ఆర్టీసీలో ఎన్నికలు జరిగాయి.

Tags

Related News

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలపై బీఆరెస్‌ సైలెంట్‌.. ! కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలొచ్చినా.. ఓన్‌ చేసుకోలేని దీన స్థితి..! యూనియన్లనే రద్దు చేసిన ఘతన ఆ పార్టీది!

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

Big Stories

Advertisement
×