E-Paper
Advertisement

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!
Advertisement

Children Somatization: సాధారణంగా పిల్లలు తరచూ ‘నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను’ అని చెప్తుంటారు. కానీ ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్లేముందు కడుపునొప్పి అనడమో, పరీక్షల సమయంలో తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడటమో గమనిస్తుంటాం. చాలామంది తల్లిదండ్రులు దీన్ని స్కూల్‌కి వెళ్లకుండా చెప్పే సాకులుగా భావిస్తారు. అయితే, ఇది కేవలం బద్ధకం కాకపోవచ్చు. పిల్లలు తమ మనసులోని భయాన్ని, ఆందోళనను మాటల్లో చెప్పలేకపోయినప్పుడు వారి శరీరం ఈ రూపంలో వ్యక్తపరుస్తుంది. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ‘సోమటైజేషన్’ అంటారు. అంటే మానసిక ఒత్తిడి శారీరక నొప్పులుగా మారడం అన్నమాట.

శరీరానికి, మనసుకు ఉన్న సంబంధం:

పిల్లల మెదడు, శరీరం ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉంటాయి. తమను ఏదైనా విషయం భయపెడుతున్నా, లేదా ఒత్తిడికి గురిచేస్తున్నా పిల్లలు దాన్ని మానసికంగా తట్టుకోలేరు. అది జీర్ణ వ్యవస్థపై, నిద్రపై లేదా తలనొప్పి రూపంలో ప్రభావం చూపుతుంది. పిల్లలు కావాలని నటిస్తున్నారని అనుకోవడం పొరపాటు. వారి నొప్పులు నిజమైనవే, కానీ దానికి కారణం మానసిక ఆందోళన కావచ్చు.

ప్రవర్తనలో కనిపించే మార్పులు:

Advertisement

చిన్న పిల్లలు తమ భయాన్ని కోపం, చిరాకు, ఏడుపు లేదా తల్లిదండ్రులను వదలకుండా పట్టుకుని ఉండటం ద్వారా చూపిస్తారు. అదే టీనేజ్ పిల్లలైతే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం, తిండి సరిగా తినకపోవడం, చదువులో వెనుకబడటం వంటి మార్పులు చూపిస్తారు. ప్రతి చిన్న గొడవ వెనుక లేదా స్కూలుకి వెళ్లేందుకు నిరాకరించడం వెనుక ఏదో ఒక లోతైన కారణం ఉండే అవకాశం ఉంది.

Also Read: హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

తల్లిదండ్రులు ఏం చేయాలి?

Advertisement

ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కొన్ని విషయాలను గమనించాలి. ఈ నొప్పులు ఎప్పుడు వస్తున్నాయి, స్కూలు ఉన్న రోజుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయా లేదా ఏదైనా పరీక్షల సమయంలోనే వస్తున్నాయా అనేది చూడాలి. అలాగే స్కూళ్లో ఫ్రెండ్స్‌తో లేదా టీచర్లతో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అయితే నిరంతరం వచ్చే శారీరక నొప్పులకు ముందుగా డాక్టర్‌ని కలిసి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకోవడం ముఖ్యం.

సహనంతో మాట్లాడాలి:

పిల్లలు నొప్పుల గురించి చెప్పినప్పుడు ‘నువ్వు నాటకాలు ఆడుతున్నావు’ అని కొట్టిపారేయకూడదు. ‘నీకు ఎంత బాధగా ఉందో నాకు అర్థమవుతోంది, మనం దీని గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం’ అని ధైర్యం చెప్పాలి. చిన్న పిల్లలతో ఆడుకునేటప్పుడు లేదా డ్రాయింగ్ చేసేటప్పుడు మాటలు కలపాలి. టీనేజర్లతో వాకింగ్ చేస్తూనో.. ప్రయాణాల్లోనో సహజంగా మాట్లాడాలి. ఒత్తిడి వచ్చినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో వారికి సున్నితంగా వివరించాలి.

ఎప్పుడు సహాయం తీసుకోవాలి?

పిల్లల్లో శారీరక నొప్పులు తరచూ వస్తున్నా.. వారి ప్రవర్తనలో ఆందోళనకరమైన మార్పులు కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా పీడియాట్రీషియన్ లేదా మానసిక నిపుణులను సంప్రదించాలి. ముఖ్యంగా టీనేజర్లు నిరాశగా మాట్లాడినా, తమను తాము బాధించుకునే ప్రయత్నం చేసినా వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి. సరైన సమయంలో స్పందిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తును అందించవచ్చు.

Also Read: 10 నిమిషాల్లో పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్ షెజ్‌వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్!

Tags

Related News

ఈవినింగ్ స్నాక్స్‌కు పర్‌ఫెక్ట్ ..తిన్నాకొద్దీ తినాలనిపించే గుమగుమలాడే మసాలా వడ

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

Big Stories

Advertisement
×