Modi relefs in Budget : ప్రతీసారి బడ్జెట్ వచ్చింది అంటే చాలు మధ్యతరగతి ప్రజలు, చిన్నపాటి ఉద్యోగులు తమకేమైనా వరాలు అందుతాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ మంచి శుభవార్త వినే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశ ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం లక్ష్మీదేవీ కటాక్షించాలంటూ ఆయన ప్రార్థించడంతో ఆయా వర్గాల్లో ఆశలు పెరిగిపోయాయి. రేపటి బడ్జెట్లో ఈ వర్గాలకు అందించే ప్రయోజనాల గురించే ప్రధాని ప్రస్తావించి ఉంటారంటూ చర్చలు నడుస్తున్నాయి.
ప్రజాస్వామ్య దేశంగా భారత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ.. ప్రపంచ పీఠంపై భారత్ బాగా స్థిరపడిందని, ఇది తొలి సంపూర్ణ బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. 2047 నాటికి స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, అప్పటి వరకు వికసిత భారత్ లక్ష్యాల్ని నెరవేర్చుకోవాలన్నప్రధాని మోదీ.. అందుకు ఈ బడ్జెట్ దేశానికి కొత్త శక్తిని, ఆశను ఇస్తుందని నమ్ముతున్నా అంటూ వ్యాఖ్యానించారు. వీటితో పాటుగా సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా దూసుకెళ్తున్నామంటూ ప్రకటించారు. దాంతో.. వృద్ధికి ఊతం ఇచ్చేలా, మధ్యతరగతి వర్గాలపై పన్ను భారాన్ని తగ్గిస్తారని ఆశిస్తున్నారు. దాంతో పాటే.. మహిళలకు ప్రత్యేకంగా పథకాలు ప్రారంభించవచ్చని అనుకుంటున్నారు.
అయితే వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఈసారి మార్పులు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో శ్లాబుల హేతుబద్ధీకరణ, మధ్యతరగతి వర్గాల చేతిలో డబ్బులు మిగిలేలా స్టాండర్డ్ డిడక్షన్ పెంపుదల, రిబేట్ పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు ఆశపెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టు బడ్జెట్లో ఈ వర్గాల వారికి ప్రత్యేక ప్రయోజనం చేకూర్చితే.. కోట్లమందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే.. కేంద్ర బడ్జెట్ పై వెలువడుతున్న అనేక నివేదికలను బట్టి కొత్త పన్ను విధానంలో ప్రధాన మార్పులు పనిలో ఉన్నాయి, రూ. 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వడంతో పాటు రూ. 15 లక్షల నుంచి రూ. రూ. 20 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి కోసం కొత్తగా 25 శాతం ట్యాక్స్ స్లాబ్ ను పరిచయం చేయొచ్చని భావిస్తున్నారు.
కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లు:
ఆదాయపు పన్ను స్లాబ్‌లు పన్ను రేటు
0-రూ 3 లక్షలు సున్నా
రూ.3-7 లక్షలు 5%
రూ.7-10 లక్షలు 10%
రూ.10-12 లక్షలు 15%
రూ.12-15 లక్షలు 20%
15 లక్షలకు పైనే 30%
Also Read : ఒక కుటుంబం నెలకు రూ.35 వేలు ఆదా చేస్తుందా? అది కూడా దిల్లీలో.. నమ్మొచ్చా కేజ్రీ?
తమ ప్రభుత్వానికి మహిళా సాధికారత కూడా చాలా ముఖ్యమైన అంశమని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. ఆసారి బడ్జెట్ లో అందుకు తగ్గట్లు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న మహిళలకు ప్రయోజనం కల్పించే పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు, ప్రస్తుత పథకాలకు అందిస్తున్న ప్రయోజనాల్ని పెంచవచ్చని భావిస్తున్నారు.