BigTV English

Vivo T3 Pro 5G: 80W ఫ్లాష్‌ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5500mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. కెమెరా మాత్రం హైలైట్..!

Vivo T3 Pro 5G: 80W ఫ్లాష్‌ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5500mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. కెమెరా మాత్రం హైలైట్..!

Vivo T3 Pro 5G Launching Soon: అతి తక్కువ ధరలో ఒక మంచి కెమెరా ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకున్న వారు ఎక్కువగా వివో ఫోన్లనే ఎంచుకుంటారు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ధరలో ఉండటమే కాకుండా ఫోటోలు చాలా క్లారిటీగా వస్తుంటాయి. అందువల్లనే వివో ఫోన్లకు దేశీయ మార్కెట్‌లో మంచి గిరాకీ పెరిగింది. దీని కారణంగానే వివో కంపెనీ కూడా తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారతదేశంలో ప్రారంభించబోతుంది.


దీని కంటే ముందు Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2023లో భారతదేశంలో లాంచ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇకపోతే కంపెనీ గత వారం Vivo T3 Pro 5G హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడాన్ని అధికారికంగా ధృవీకరించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. అదే క్రమంలో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ సహా ఇతర కొన్ని ముఖ్య లక్షణాలను వెల్లడించింది. అయితే ఒక కొత్త నివేదిక Vivo T3 Pro 5Gకి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను దాని అధికారిక లాంచ్ కంటే ముందే అందించింది.

Vivo T3 Pro 5G Specifications


Also Read: దూకుడుమీదున్న వివో.. మరో కొత్త సిరీస్‌ నుంచి రెండు ఫోన్లు.. ఫీచర్లు లీక్..!

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫ్లాష్‌ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్‌తో కూడా రానుందని తెలుస్తోంది. అదే నివేదిక ప్రకారం.. Vivo T3 ప్రో 5G వేగన్ లెథర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. దీనికి సంబంధించి కంపెనీ గతంలో ఆరెంజ్ షేడ్‌లో ఉన్న ఓ పోస్టర్‌ను టీజ్ చేసింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 7 Gen 3 SoC, 8GB RAM, Adreno 720 GPUతో ఇటీవల గీక్‌బెంచ్‌ సైట్‌లో కనిపించిందని నివేదిక పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత UIతో వస్తుందని భావిస్తున్నారు.

Vivo T3 Pro 5G India Launch

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో దీని ధర రూ.25,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లీక్‌ల ఆధారంగా Vivo T3 ప్రో 5G రీబ్రాండెడ్ iQOO Z9s ప్రోగా కనిపిస్తుంది. ఇది ఆగస్టు 21న భారతదేశంలో ప్రారంభించబడుతోంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×