E-Paper
Advertisement

UPSC జాబ్స్.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగం.. రూ.1 లక్షపైగా జీతం

UPSC జాబ్స్.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగం.. రూ.1 లక్షపైగా జీతం
Advertisement

UPSC APFC Recruitment| యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్‌ ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 80 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 22, 2026 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 11, 2026గా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అన్ని అర్హత నిబంధనలను పరిశీలించాలి.

దరఖాస్తు తేదీలు తెలుసుకోండి

యాపిఎస్‌సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నియామకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆగస్టు 22, 2026న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 11, 2026న దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. రాత పరీక్ష తేదీని యాపిఎస్‌సి ఇంకా ప్రకటించలేదు. పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

వివిధ కేటగిరీలలో 80 పోస్టుల భర్తీ

Advertisement

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 80 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 29 పోస్టులు అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఈ డబ్లూఎస్ కేటగిరీకి 8 పోస్టులు కేటాయించారు. ఓబిసి కేటగిరీకి 18 పోస్టులు ఉన్నాయి. ఎస్‌సి కేటగిరీకి 15 పోస్టులు కేటాయించారు. ఎస్‌టి కేటగిరీకి 10 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత

అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.

Advertisement

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

వయోపరిమితి

అన్‌రిజర్వ్డ్, ఈడబ్లూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. అర్హత ఉన్న EPFO ఉద్యోగులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కలిగిన అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు లభిస్తుంది.

Also Read: రిటైర్మెంట్ అంటే భయపడుతున్న భారతీయులు.. ఏ వయసు నుంచి ప్లానింగ్ ప్రారంభించాలి?

జీతభత్యాలు (అంచనా)

యుపిఎస్‌సి ద్వారా ఎంపికయ్యే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగానికి 7వ వేతన సంఘం ప్రకారం పే లెవల్-10లో రూ.56,100 ప్రాథమిక నెల జీతం లభిస్తుంది (అంచనా) .
అలవెన్సులు కలిపితే అంచనా గ్రాస్ సాలరీ జీతం సుమారు రూ.1,15,679 వరకు ఉంటుంది. సాధారణ మినహాయింపుల తర్వాత ఉద్యోగికి నెలకు సుమారు రూ.1,00,000 నుంచి రూ.1,06,896 వరకు చేతికి వచ్చే జీతం (ఇన్-హ్యాండ్ శాలరీ) లభించవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా పూర్తి చేయాలి

అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. ఫోటో, సంతకం, గుర్తింపు పత్రం వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను మరోసారి చెక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని భద్రంగా ఉంచుకోవాలి.

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష

అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్ష ప్రధాన దశగా ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. పరీక్ష తేదీని UPSC తరువాత ప్రకటించనుంది.
అందువల్ల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే ప్రకటనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

Tags

Related News

అలాంటి హిజ్రాలతో జాగ్రత్త.. తేడా వస్తే కొంప కొల్లేరు, అసలు ఏం జరిగింది?

ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్

E20 పెట్రోల్ దెబ్బ.. దేశంలో వేగంగా పెరుగుతన్న చక్కెర ధరలు..

న్యాయమూర్తి కాదు యముడు.. 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. దెబ్బకు 100 హత్యకేసులు మరో కోర్టుకు బదిలీ

‘ఆవేశంలో నోరు జారా.. డిప్రెషన్‌లోకి వెళ్లా’.. సైన్యానికి Gen Z యువతి క్షమాపణ

SBI ఉద్యోగి ఘోరం.. భార్య, చెల్లిని చంపి.. హనుమాన్ చాలీసా వింటూ ఆత్మహత్య!

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!

Big Stories

Advertisement
×