Vivo Smart Phone: అసలే టెక్ యుగం.. లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ఫోన్ మార్కెట్‌లోకి దిగినా హాట్ కేకుల్లా అమ్మడుపోతాయి. తాజాగా చైనాకి చెందిన వివో కంపెనీ కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ Vivo V50e గురువారం మధ్యాహ్నం భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.
వివో V50e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ కలిగి ఉంది. వివిధ రకాల AI ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. అంతేకాదు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం కలిగివుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. యూత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందన్నమాట.
వివో V50e స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ ఉంటుంది. అందులో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర కేవలం రూ. 28,999. మరొక వేరియంట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 30,999 నిర్ణయించింది ఆ కంపెనీ.
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువలో తక్కువగా అదనంగా 10 శాతం రానుంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్‌పై ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని అందించింది. మొదటి సేల్ ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్‌తోపాటు అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో ప్రారంభంకానుంది. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.
ALSO READ: ఆపిల్, శామ్ సంగ్ మోడళ్లకు ఇన్ఫినిక్స్ సవాల్
వివో V50e స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లోకి ఒక్కసారి వెళ్తొద్దాం. షాఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ కలర్ వేరియంట్స్ ఉండనున్నాయి. 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగివుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఒక వేరియంట్ రానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో మరొక వేరియంట్స్ వస్తుంది. ఫోన్ వైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉండనుంది. ఇక 4K వీడియో రికార్డింగ్ ఉండనుంది.
HDR సపోర్ట్ తోపాటు 1080 x 2392 పిక్సల్స్ రిజల్యూషన్ ఉండనుంది. IP68 / IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ కలిగివుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్, ఫన్ టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.