Sonal Chauhan:సినిమాల్లో కనిపించే అందాల భామలు ఇపుడు సోషల్ మీడియాలో చూపు తిప్పుకోలేకుండా తమ అందాలని ఒలకబోస్తున్నారు.ఇపుడు అదే బాటలో నేనూ అంటుంది సోనల్ చౌహాన్.ఇంతకీ ఈ భామ ఎవరంటారా ..నందమూరి బాలకృష్ణతో నటించిన ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్ గ కనిపించింది ఈ ముద్దుగుమ్మే.
తాజాగా సోనల్ చౌహాన్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన ఈ భామ లైట్ కలర్ శారీ, గోల్డ్ టచ్ ఉన్న డిజైనర్ బ్లౌజ్, మెడలో భారీ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో రిచ్‌గా కనిపిస్తూ క్రేజీ లుక్స్ తో అభిమానుల్ని తన వైపుకి తిప్పేసుకుంది.
ముఖ్యంగా సోనల్ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, కెమెరాను చూస్తూ ఇచ్చిన పోజులు ఈ ఫొటోలకు మరింత అట్రాక్షన్ తీసుకొచ్చాయనే చెప్పాలి.
పర్ఫెక్ట్ మేకప్, హెయిర్ స్టైల్ తో ఆమె కనిపించిన తీరు ఫ్యాషన్ లవర్స్ కి మాంచి ఐ ఫీస్ట్ ని అందించింది.
సోనల్ చౌహాన్ పేరు చెప్పగానే మూవీ లవర్స్ కి మొదటగా గుర్తొచ్చే సినిమా ‘జన్నత్’. ఇమ్రాన్ హష్మీ హీరోగా వచ్చిన ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా మంచి క్రేజ్ కొట్టేసింది.ఆ తర్వాత హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ తన లక్ ని టెస్ట్ చేసుకుంది ఈ భామ.
అయితే కేవలం స్కిన్ షో కే పరిమితం కాకుండా బుడ్డా హోగా తేరా బాప్’, ‘పహ్లా సితారా’, ‘పల్టన్’ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ పోషించి ఆడియన్స్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో బాలయ్య సరసన ‘డిక్టేటర్’ సినిమాలో తళుక్కుమన్న సోనాల్ ‘ది ఘోస్ట్’ సినిమాలో కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుని గ్లామర్‌తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనల్, తన కొత్త ఫ్యాషన్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఎప్పుడు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది.ఇక ఈ భామ వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లో ఎంత మోడ్రన్‌గా కనిపిస్తుందో , చీర ,లెహంగా వంటి ట్రెడిషనల్ దుస్తుల్లో అంతే అబ్బురపర్చడం విశేషం.
అందుకే ఆమె ఫొటోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ నెటిజన్ల నుంచి కామెంట్స్, లైక్స్ వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా ఈ గోల్డ్ అండ్ బీజ్ కలర్ శారీ లుక్‌లో సోనల్
కనిపించడం తో అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఎలాంటి హడావుడి లేకుండా జ్యువెలరీ, మేకప్, హెయిర్ స్టైల్‌ను బ్యాలెన్స్ చేసిన తీరుని మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి సోనల్ చౌహాన్ తన లేటెస్ట్ శారీ పిక్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది .