Actor Noel Sean: ర్యాపర్, సింగర్, నటుడు నోయెల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, విలన్ గా, స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన గేమ్ తో మరింతమందికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నోయెల్ జీవితంలో చెరిగిపోని ముద్ర అంటే.. అతని పెళ్లినే. అందరికి పెళ్లి అంటే ఒక కల.
నోయెల్ కూడా ఆలాగే ఎన్నో కలలతో నటి ఎస్తేర్ ను ప్రేమించి పెళ్లాడాడు. కానీ, ఆ ప్రేమ పెళ్లి.. ముచ్చటగా 16 రోజులు కూడా నిలువలేదు. ఇండస్ట్రీలోనే పెద్ద రికార్డ్.. పెళ్లి అయిన 16 రోజులకే విడాకులు తీసుకున్న జంట నోయెల్ – ఎస్తేర్ అని.. అయితే వీరి విడాకులకు కారణాలు చాలానే ఉన్నాయి. ఎస్తేర్ తన వెర్షన్ చెప్పుకొస్తే.. నోయెల్ అతడి వెర్షన్ చెప్పుకొచ్చేవాడు. నోయెల్ కన్నా ఎక్కువ ఎస్తేర్.. తన విడాకులకు కారణం తన మాజీ భర్త బిహేవియర్ అని,పెళ్ళికి ముందు ఉన్న క్యారెక్టర్.. పెళ్లి తరువాత ఉండదని, తన కెరీర్ కు కూడా చాలా ప్రాబ్లెమ్ గా అనిపించి విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.
Mohanlal: మోహన్ లాల్ లవ్ స్టోరీ.. ఇంత విసిగిపోయారా..?
ఫోర్స్ బుల్ గా ఉండడం తన వల్ల కాదని, తన భవిష్యత్తుకు, తన ఇండివిడీజ్యువాలిటీ కి అడ్డుకట్ట వేసేలా అతడి ప్రవర్తన ఉండేదని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. దీనివలన నోయెల్ కు బయట నెగెటివ్ టాక్ వచ్చింది. అతని కెరీర్ నాశనం అయ్యింది. ఎంతోమంది అతడి గురించి తప్పుగా మాట్లాడారు. అయినా వాటన్నింటిని తట్టుకొని నోయెల్ నిలబడ్డాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడాడు.
” ఆమె పేరు తీసుకురాకుండా మాట్లాడండి.. లీగల్ గా డైవర్స్ తీసుకున్నాం.. ఆమె పేరు బయట చెప్పే హక్కు నాకు లేదు. నేను పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాను. నాదే తప్పు. అలా అనుకొనే నేను సర్దుకుంటున్నాను. ఆ సమయంలోనే నా కెరీర్ గ్రాఫ్ తగ్గింది . అందులో అది కరోనా సమయం కూడా. నేను ఆమెను తప్పు పట్టడం లేదు. నేనే సరిగ్గా చేయలేకపోయాను. తను చెప్పినవన్నీ నిజాలే అయితే.. అలాగే ఉండనివ్వండి. నేను దానికి వివరణ ఇచ్చి వాటిని అబద్దాలుగా ఎందుకు మార్చాలి.
Rupali Ganguly: పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకుంది.. నటిపై సవతి కూతురు ఫైర్
ఆమె నా మీద బురద చల్లింది.. నేను ముఖం తుడుచుకుంటే సరిపోతుంది. మళ్లీ నా ముఖం మీద ఉన్న బురదను ఎందుకు తిరిగి కొట్టాలి. నా గురించి ఆమె బ్యాడ్ చెప్పినా ఓకే. కానీ తన గురించి నేనెప్పుడూ బ్యాడ్ చెప్పను. ఆమె అంటే ఇప్పటికీ ఇష్టమే. ఈ ఇంటర్వ్యూ వలన ఆమెకు బ్యాడ్ జరిగితే నేను తీసుకోలేను. క్షమించడం కనెను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. అది నేను చేయకపోతే నేను నేర్చుకున్నదానికి అర్ధం ఏముంటుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటవైరల్ గా మారాయి.