E-Paper
Advertisement

Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!

Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!
Advertisement

Vi Combo Plans: వొడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు ‘కాంబో వాలిడిటీ’ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో కనెక్టివిటీ, టాక్‌టైమ్‌, డేటా ప్రయోజనాలను కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. రూ.160 లోపు బడ్జెట్ లో వీఐ తీసుకొచ్చిన చౌకైన కాంబో ప్యాక్స్, వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 98 ప్లాన్

15 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 200MB డేటా యూజర్లకు లభించనుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత ప్రతి 1MBకి 50 పైసలు వసూలు చేస్తారు.

రూ. 99 ప్లాన్

Advertisement

టాక్‌టైమ్ తో పాటు వ్యాలిడిటీ రెండూ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో సెకనుకు 2.5 పైసల చొప్పున కాల్ ఛార్జీలు, అలాగే 200MB డేటా లభిస్తుంది. పై ప్లాన్ తరహాలోనే ఇందులోనూ ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉండవు.

రూ. 107 ప్లాన్

నెలకు సరిపడా వ్యాలిడిటీ, బేసిక్ టాక్‌టైమ్ కోరుకునే వారి కోసం ఈ ప్యాక్ రూపొందింది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో రూ. 107 టాక్‌టైమ్, సెకనుకు 2.5 పైసల కాల్ రేట్, 200MB డేటా లభిస్తాయి. అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్ ప్రయోజనం ఉండదు. ప్లాన్ పూర్తయ్యేనాటికి టాక్ టైమ్ వాడుకోవాల్సి ఉంటుంది.

రూ. 111 ప్లాన్

Advertisement

30 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో యూజర్లకు రూ. 111 టాక్‌టైమ్, సెకనుకు 2.5 పైసల చొప్పున కాల్ ఛార్జీలు, 200MB డేటా లభిస్తాయి. ఇందులోనూ ఫ్రీ ఎస్ఎంఎస్ సౌకర్యాలు లేవు.

రూ. 140 ప్లాన్

నోకియా వంటి ఫీచర్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారికోసం ఈ ప్రత్యేక ప్లాన్ రూపొందించబడింది. 15 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో అర్హత కలిగి యూజర్లకు అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే ఇతర స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వీలుండదని వీఐ వర్గాలు తెలిపాయి.

రూ. 149 ప్లాన్

తక్కువ బడ్జెట్‌లో కాల్స్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌లు కూడా కావాలనుకునే వారికి ఇది బెస్ట్. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 1GB ఉచిత డేటా, 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా కోటా పూర్తయితే ప్రతి MBకి 50 పైసలు, ఎస్‌ఎంఎస్ కోటా పూర్తయితే లోకల్‌కు రూ. 1, ఎస్‌టీడీకి రూ. 1.50 చొప్పున ఛార్జ్ చేస్తారు.

Also Read: ‘డీఎస్సీపై అసత్యాలు ఆపండి’.. అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్!

రూ. 155 ప్లాన్

28 రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ ప్లాన్ లో నాన్ స్టాప్ కాల్స్ తో పాటు 1.2GB ఉచిత డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. పరిమితి దాటిన తర్వాత డేటాకు 1MB డేటాకు 50 పైసలు, ఎస్‌ఎంఎస్‌లకు నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి.

Also Read: అసెంబ్లీకి పవన్ ఎందుకు రాలేదు? క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×