MI Vs RCB : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లో బౌల్ట్ వేసిన తొలి బంతికి ఫోర్ బాదిన సాల్ట్.. ఆ తరువాత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే లో కీలక వికెట్లు తీయడంలో బౌల్ట్ దిట్ట అనే చెప్పవచ్చు.
వికెట్ పోయినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం తనదైన కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ లో 13,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబయి ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 17 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద 13000 పరుగుల మార్క్ దాటాడు. 386 ఇన్నింగ్స్ ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ కంటే ముందు నలుగురు టీ20 లలో 13వేల రన్స్ పూర్తి చేశారు. క్రిస్ గేల్ 14,562, 13,610 అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ 13,557 , పోరాల్డ్ 13, 537 130001 విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ నిలకడగా ఆడారు. సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 67 పరుగులు చేసిన తరువాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. బుమ్రా ఆర్సీబీ వేగానికి కళ్లెం వేశాడు. తొలి 12 ఓవర్లలో 112 పరుగులు చేసింది ఆర్సీబీ. పడిక్కల్ 37 పరుగులు చేసి విఘ్నేష్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన రజత్ పాటిదార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ 2 బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ బుమ్రా క్యాచ్ అందుకున్నాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ నిలకడగా ఆడాడు. కెప్టెన్ రజత్ పటిదార్ 64 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జితేష్ శర్మ, రజత్ పాటిదార్ కీలకంగా ఆడారు. చివరి ఓవర్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ బుమ్రా బౌలింగ్ లో జితేష్ శర్మ సిక్స్ బాదాడు. ఆర్సీబీ జట్టు 221 పరుగులు చేసింది. 5 వికెట్లను కోల్పోయింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, హార్దిక్ పాండ్యా 2, విఘ్నేష్ 1 వికెట్ తీశారు.
ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, పడిక్కర్, జితేష్ శర్మ అందరూ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ 221 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలింగ్ బలంగా ఉండటంతో ముంబై 222 పరుగుల టార్గెట్ ను ఛేదించడం కష్టమేనని ఆర్సీబీ అభిమానులు పేర్కొంటున్నారు. ముంబై ఛేదిస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి మరీ.