Congress Rift: మంచిర్యాల కాంగ్రెస్‌లో క్రమంగా మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మధ్య అంతర్గత విభేదాలు బైటపడుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై అసమ్మతి వర్గం ఏర్పడుతుంది. దీంతో మంత్రి వివేక్ చెంతకు అసమ్మతి వర్గం చేరుతుంది. దీంతో అసమ్మతి వర్గానికి కాంగ్రెస్ నేత మంతెన జగన్‌మోహన్‌రావు నాయకత్వం వహిస్తున్నారు.
జగన్ మోహన్‌తో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ను కలుస్తున్న అసమ్మతి నేతలు వరుసగా కలుస్తున్నారు. అసమ్మతి వర్గంలో తాజాగా మంచిర్యాల నుండి ఏడుగురు కార్పొరేటర్లు, లక్షెట్ పేట్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బైటికి వచ్చారు. గతంలోను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్‌కు అత్యంత సన్నిహితుడిగా జగన్ మోహన్ రావ్ ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్‌కు జగన్ మోహన్ రావు దూరమయ్యారు. MLA కు దూరమై మంత్రి వివేక్ చెంతకు చేరారు. చాలా ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకొని కాక వెంకటస్వామి విగ్రహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా జగన్ మోహన్ ఆవిష్కరించారు.
Also Read: బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!
దీంతో మంచిర్యాల జిల్లాలో రాజకీయాలలో తీవ్ర దుమారం రేగింది. విగ్రహ ఆవిష్కరణతో మంత్రి వివేక్ తన ప్రాబల్యాన్ని మంచిర్యాలలో పెంచుకున్నడనే సంకేతలు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారనుకుంటున్నారు. చెన్నూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చిన నాటి నుండి ఏదో సందర్భంలో బయటపడుతున్న మంత్రి వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో మంత్రి వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఎంపీ పర్యటన ఫ్లెక్సీలను MLA వర్గీయులు చింపేసారు.
Also Read: పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్