VW Visio World 8.5 kg Washing Machine: ప్రస్తుత కాలంలో.. ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిడిల్ క్లాస్ కుటుంబాలు.. లేదా బ్యాచిలర్లు అంతపెద్ద మొత్తంలో ఖర్చు పెట్ట లేక ఇబ్బంది పడుతుంటారు. సరిగ్గా .. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ‘వీడబ్ల్యూ విసియో వరల్డ్’ సంస్థ అద్భుతమైన ఫీచర్లతో.. సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సామర్థ్యం కోరుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.ఆఫర్ ధరలో వస్తున్న ఈ మోడల్ ను కొనడానికి జనం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆన్ లైన్ సేల్స్, ఆఫర్ల ప్రకారం దీని ధర కేవలం రూ. 5,099 మాత్రమే ఉంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. 8.5 కేజీల కెపాసిటీ కలిగిన వాషింగ్ మెషీన్ లభించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది.
ఈ వాషింగ్ మెషీన్ బ్లాక్ ,గ్రే కాంబినేషన్‌లో వస్తుంది. ఇది చూడటానికి చాలా మోడ్రన్‌గా, ట్రెండీగా ఉంటుంది. మీ బాత్ రూమ్ లేదా లాండ్రి ఏరియాలో ఎక్కడ పెట్టుకున్నా ఇది ఇంటికి మంచి లుక్ ఇస్తుంది. దీని ప్లాస్టిక్ బాడీ రస్ట్-ప్రూఫ్ తో తయారైంది కాబట్టి నీరు తగిలినా తుప్పు పట్టే.. అవకాశం ఉండదు. దీన్ని ఈజీగా.. ఒక చోటు నుంచి మరో చోటుకి మార్చుకోవచ్చు.
పెద్ద కుటుంబాల బట్టలు, జీన్స్, బెడ్ షీట్లు, వింటర్స్ వేర్ కూడా ఒకేసారి ఉతకడానికి 8.5 కేజీల కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. ఇందులో.. ప్రత్యేకంగా V8 Supreme-Wash టెక్నాలజీని వాడారు. దీని వల్ల బట్టలపై ఉన్న మొండి మరకలు, ధూళి ఈజీగా వదిలిపోతాయి.అంతే కాకుండా దీని మోటార్ పని చేయడం వల్ల బట్టలు చిరిగిపోకుండా చాలా శుభ్రంగా ఉతుకుతాయి.
Also Read: రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర
ఈ వాషింగ్ మెషీన్‌లో వాష్ టబ్, స్పిన్ టబ్ వేర్వేరుగా ఉంటాయి. బట్టలు ఉతకడానికి , ఆరబెట్టడానికి వేర్వేరు టైమర్ నాబ్స్ ఉంటాయి. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి వాటర్ ఇన్‌లెట్ నాబ్ ఉంటుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో పని చేసే పవర్ ఫుల్ మోటార్ ఇందులో ఉంది. పవర్ బిల్లు ఎక్కువ వస్తుందనే టెన్షన్ ఉండదు.
బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ బట్టలు ఉతకడానికి పవర్ ఫుల్ మెషీన్ కావాలనుకునే వారికి ఇది ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. 5,099 ఉండటం వల్ల సామాన్యులకు కూడా ఇది అందుబాటులో ఉంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ కెపాసిటీ, స్టైలిష్ లుక్ ,అద్భుతమైన క్లీనింగ్ పవర్ కోరుకునే వారికి.. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.