E-Paper
Advertisement

ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు

ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు
Advertisement

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కే దిక్కులేదు కానీ.. విదేశీ విద్యను అందిస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు అందక ఉన్న కాలేజీలే మూతపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి రప్పిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న మానసిక క్షోభకు సీఎంకు పట్టదా? అంటూ నిలదీశారు.

తెలంగాణలో కొన్ని కాలేజీ యాజమన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను అవమానిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. ఇవి సీఎం రేవంత్ కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. రావాల్సిన ఫీజు బకాయిలు అడిగితే కాలేజీ యాజమాన్యాలను బెదరించడం తప్ప కాంగ్రెస్ సర్కార్ సాధించిందేంటి? అని నిలదీశారు. ఫీజు రీయంబర్స్ బకాయిలవల్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని బండి అన్నారు.

Advertisement

ఇందిరమ్మ రాజ్యమంటే దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఉన్నత విద్యకు దూరం చేయడమేనా? అంటూ బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ టైం సెటిల్ మెంట్ కింద బకాయిలన్నీ చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ ను కాంగ్రెస్ మించిపోతోందని ఎద్దేవా చేశారు. తక్షణమే రూ.15 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని బండి డిమాండ్ చేశారు.

Also Read: నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, నేతల్లో కలకలం

Advertisement

ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ‘ఫీజు బకాయి బీజేపీ లడాయి’ దీక్ష చేపట్టారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ దీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Also Read: Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..

Tags

Related News

నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, నేతల్లో కలకలం

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

Big Stories

Advertisement
×