E-Paper
Advertisement

పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!

పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!
Advertisement

Post Office Scheme: సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా పోస్టాఫీసు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్ రిస్క్ లేకుండా, ప్రభుత్వ ష్యూరిటీతో.. దాచే ప్రతీ రూపాయికి ఈ పథకాలు భరోసా కల్పిస్తున్నాయి. అయితే పోస్టాఫీసు తీసుకొచ్చిన పొదుపు పథకాల్లో.. ‘పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD)’ ఎంతో పాపులర్ అయ్యింది. ఈ స్కీమ్ లో నెలకు రూ.8,000 పొదుపు చేయడం ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.5.68 లక్షల నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలేంటీ పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్?

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికోసం పోస్టాఫీసు.. ఈ ఆర్డీ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేలా పోస్టాఫీసు వీలు కల్పిస్తోంది. రూ. 100 కనీస పెట్టుబడితో పొదుపును ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. మీ ఆదాయానికి తగినట్లుగా ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేయవచ్చు. ఈ ఖాతా కాలవ్యవధి ఐదేళ్లు (60 నెలలు).

రూ.8,000తో రూ.5.68 లక్షలు ఎలా?

Advertisement

పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్ లో ప్రతి నెలా రూ.8,000 చొప్పున జమ చేయడం ద్వారా ఐదేళ్ల కాల వ్యవధిలో భారీ మెుత్తంలో సమకూర్చుకోవచ్చు. రూ.8000 చొప్పున 60 నెలల పాటు (5 ఏళ్లు) పొదుపు చేస్తే.. మీ పెట్టుబడి రూ.4,80,000 అవుతుంది. ప్రస్తుతం ఆర్డీ స్కీమ్ పై 6.7 శాతం వడ్డీ (ఏడాదికి) అందుబాటులో ఉంది. అంటే ఐదేళ్ల కాలానికి సుమారు వడ్డీ రూపంలోనే రూ.87,926 ఆదాయం సమకూరనుంది. మెుత్తంగా ఐదేళ్ల కాల వ్యవధి పూర్తయ్యే సరికి అసలు, వడ్డీ మెుత్తం కలిపి సుమారు రూ.5,67,926 మీ చేతికి వస్తుంది.

ఈ ఖాతాను ఎవరు ప్రారంభించవచ్చు?

దేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా తన పేరిట పోస్టాఫీసు ఆర్డీ ఖాతాను తెరవవచ్చు. గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు కలిసి ‘జాయింట్ ఖాతా’గా కూడా నిర్వహించవచ్చు. అంతేకాకుండా పసిపిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు (గార్డియన్లు) ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. నిర్ణీత వయస్సు దాటిన మైనర్లు తమ సొంత పేరుతోనే ఖాతాను నిర్వహించుకోవచ్చు.

కాలవ్యవధి పొడిగింపునకు ఛాన్స్

Advertisement

సాధారణంగా ఈ రికరింగ్ డిపాజిట్ కాలపరిమితి ఐదేళ్లు. అయితే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత కూడా ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే సదుపాయాన్ని పోస్టాఫీసు కల్పిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా మరిన్ని మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

పోస్టాఫీసు ఆర్డీ ఎందుకంత అవసరం?

నెలవారీ ఖర్చుల తర్వాత మిగిలే చిన్న చిన్న మొత్తాలను క్రమబద్ధంగా పొదుపు చేసే అలవాటును ఈ పథకం పెంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ సేవింగ్స్ ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేస్తుంది. కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రతతో పాటు ఖచ్చితమైన రాబడి లభిస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి కోరుకునేవారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ. 210తో జీవితాంతం రూ. 5,000 పెన్షన్.. మధ్యతరగతికి పండగే!

Tags

Related News

వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. అదిరిపోయే బిజినెస్ ఐడియా?

పడిపోతున్న బంగారం-వెండి ధరలు.. నెలలో 8 వేల తగ్గుముఖం, ఇవాళ మార్కెట్లో ధరలు

అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా

సెక్యూరిటీ గార్డ్ జాబ్ వదిలేసి చిన్న వ్యాపారం.. కట్ చేస్తే నెలకు రూ.50 లక్షల ఆదాయం

జీతం ఎక్కువ ఉన్నా ధనవంతులు కాలేకపోతున్నారా? కోటీశ్వరులను చేసే.. 5 గోల్డెన్ సూత్రాలు మీకోసం!

కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ. 210తో జీవితాంతం రూ. 5,000 పెన్షన్.. మధ్యతరగతికి పండగే!

రూ.106 వల్ల ఇన్సూరెన్స్ కట్.. బ్యాంక్‌కు ఊహించని షాక్.. రూ. 1.5 లక్షల జరిమానా!

Big Stories

Advertisement
×