E-Paper
Advertisement

శాంసంగ్ M సిరీస్, ఫోల్డబుల్ ఫోన్లపై ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు.. ఇంత తక్కువకి మళ్లీ దొరకవు!

శాంసంగ్ M సిరీస్, ఫోల్డబుల్ ఫోన్లపై ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు.. ఇంత తక్కువకి మళ్లీ దొరకవు!
Advertisement

Amazon Great Indian Festival 2026: తక్కువ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే కొనకుండా మరికొన్ని రోజులు ఆగడం మంచిదే. ఎందుకంటే దసరా, దీపావళి పండగల సందర్భంగా అమెజాన్ నిర్వహించనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం మోడళ్ల వరకు పలు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ సేల్‌లోని డీల్స్ ఆసక్తికరంగా మారనున్నాయి.

బడ్జెట్ M సిరీస్ ఫోన్లు:

శాంసంగ్ బడ్జెట్ విభాగంలో ఎంతో ఆదరణ పొందిన ఎం సిరీస్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి. గెలాక్సీ M17e మోడల్ అసలు ధర కంటే రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.16,999కి లభిస్తుంది. అదే విధంగా గెలాక్సీ M17 మోడల్ సాధారణంగా రూ.21,999కి లభించేది, కానీ సేల్‌లో దీని ధర రూ.19,999 కంటే తక్కువకే రానుంది. ఇక మధ్యస్థ బడ్జెట్‌లో వచ్చే గెలాక్సీ M47 మోడల్‌పై అత్యధికంగా డిస్కౌంట్ లభించనుంది. రూ.35,999 విలువైన ఈ ఫోన్‌ను కేవలం రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

ప్రీమియమ్ ఫోల్డబుల్ మోడల్స్:

ప్రీమియమ్ డిజైన్, సరికొత్త టెక్నాలజీ కోరుకునే వారి కోసం ఫోల్డబుల్ ఫోన్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ Z Fold 8 అసలు ధర రూ.1,79,999 ఉండగా.. ఈ సేల్‌లో రూ.1,72,999కే రానుంది. అలాగే మరింత ఆధునికమైన Z Fold 8 Ultra మోడల్ ధర రూ.1,99,999 నుంచి రూ.1,92,999కి తగ్గింది. ఈ ధరకు కూపన్ డిస్కౌంట్లు కూడా కలిపి ఉన్నందున అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు:

Advertisement

ఈ ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు కొనుగోలుదారులకు మరిన్ని అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. ఎస్‌బీఐ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నేరుగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్లను మార్చుకోవాలనుకునే వారికి మంచి ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు నో కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ప్రైమ్ మెంబర్ల ప్రత్యేకతలు:

మిగతా వినియోగదారుల కంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ప్రైమ్ మెంబర్లు ఒక రోజు ముందే సేల్‌లో పాల్గొని నచ్చిన ఫోన్లను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వారికి ప్రత్యేకమైన అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. శాంసంగ్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లపై కూడా దాదాపు 80 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నాయి.

Also Read: 110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

Tags

Related News

15 సెకన్ల క్రితం ఏం మాట్లాడారో మళ్లీ వినొచ్చు.. యాపిల్ వాచ్‌లో సరికొత్త AI ఫీచర్!

శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్.. 2-ఇన్-1 ల్యాప్ టాప్

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

Big Stories

Advertisement
×