Big Stories

WhatsApp New Feature: సూపరో సూపర్.. వాట్సాప్‌లో సరికొత్త AI ఫీచర్..!

WhatsApp New Feature
WhatsApp New Feature

WhatsApp New Feature: స్మార్ట్‌ఫోన్స్‌ వాడకం ప్రస్తుత కాలంలో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో వాట్సాప్ కూడా వినియోగిస్తున్నారు. ప్రతి మొబైల్ ఉండే యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. చెప్పాలంటే ఈ యాప్ ఓపెన్ చేయడంతోనే చాలామంది వారి డేని ప్రారంభిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు నుంచి బడాబాబుల వరకు నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు వాట్సాప్‌తోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ఎప్పటికప్పుటు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. వాట్సాప్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

వాట్సాప్ త్వరలో ఏఐ ఆధారిత ఇమేజ్ టూల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఫోటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇమేజ్ సైజు, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ సులభంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. అలానే ఆస్క్ మెటా అనే మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. యాప్‌లో సెర్చ్ బార్ ద్వారా మెటా ఏఐని ప్రశ్నలు అడిగి అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

Also Read: ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్.. అదిరిన మోడల్స్ ఫీచర్స్!

వాట్సాప్ ద్వారా ప్రపంచంలోని ఎవరినైనా కాంటాక్ట్ అవొచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా వాట్సాప్‌లోని డేటా హ్యాక్ అవకుండా ప్రైవసీకి పలు రకాలు ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఖాతాదారుల ఫోటోలు స్క్రీన్‌షాట్ తీయరండా బ్లాక్ చేసే ప్రైవసీ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు సెర్చ చాట్ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.

అంతేకాకుండా వాట్పాప్ ఖాతాదారుని అవతార్‌ను ఇతరులు వాడుకోకుండా చేయొచ్చు. దీని కోసం ముందుగా యాప్‌లో మై కాంటాక్ట్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత నోబడి అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. తద్వారా మీ వ్యక్తిగత అవతార్‌ను ఇతరులు ఉపయోగించలేరు. అయితే కొందరు మీ అవతార్‌ను వినియోగించే విధంగా సెట్ చేయొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News