WhatsApp New Features: రోజూ వాట్సప్ ఓపెన్ చేయగానే కనిపించే ఒకే రకమైన గ్రీన్ లుక్ చూసి బోర్ కొడుతోందా? అయితే వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై మీ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మీకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం మరింత పెరగబోతోంది. ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న కొన్ని చాట్ కస్టమైజేషన్ ఆప్షన్స్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సప్ సిద్ధమవుతోంది. చాట్ బ్యాక్‌గ్రౌండ్, థీమ్‌కు సంబంధించిన కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్‌తో మన వాట్సప్ మరింత పర్సనలైజ్డ్‌గా మారబోతోంది.
ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్లను వాట్సప్ బీటా వెర్షన్‌లో పరీక్షిస్తోంది. టెస్టింగ్ విజయవంతమైతే త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఆ కొత్త కస్టమైజేషన్ ఫీచర్లు ఏంటి? మన చాటింగ్ లుక్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటివరకు వాట్సప్‌లో వాల్‌పేపర్ మార్చాలన్నా ఏదో ఒకటే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. నేచర్, లైవ్, మినిమల్, డూడుల్ పేరుతో నాలుగు రకాల కేటగిరీలను తీసుకువస్తున్నారు. మన మూడ్‌ను బట్టి నేచర్ అంటే చెట్లు, అడవులు, కొండలు లేదా సముద్రపు అందాలను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. ఒకప్పుడు వాట్సప్‌లో బాగా పాపులర్ అయిన డూడుల్ డిజైన్స్ మళ్లీ వచ్చేస్తున్నాయి. ఇక అందరినీ ఆకట్టుకునేలా లైవ్ థీమ్స్ కూడా వస్తున్నాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్న చిన్న కదిలే యానిమేషన్స్ కనిపిస్తాయన్నమాట.
Also Read:
ఇంతకుముందు థీమ్ మారుస్తే వాల్‌పేపర్ దానితోపాటే మారిపోయేది. కానీ రాబోయే అప్డేట్‌లో ఈ రెండింటినీ విడదీస్తున్నారు. దీనివల్ల మనకు నచ్చిన వాల్‌పేపర్‌ను యథావిధిగా ఉంచుకుంటూనే.. కేవలం ఛాట్ థీమ్స్‌ను మాత్రం మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు. అంతేకాదు.. వాల్‌పేపర్ స్టిక్కర్‌లో వైబ్రెంట్, గ్రాడియెంట్ అని కొత్త సెక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఫోన్ గ్యాలరీలోని ఫొటోలతో పాటు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మనకు నచ్చిన వాల్‌పేపర్లనూ సృష్టించుకునే వెసులుబాటు కూడా ఉండబోతోంది.
మనం పెట్టుకునే థీమ్ లేదా వాల్‌పేపర్‌కు తగినట్టుగా మెసేజ్‌లు కనిపించే ఛాట్ బబుల్ కలర్ కూడా మారిపోతుంది. టెక్స్ట్ క్లియర్‌గా చదువుకోవడానికి వీలుగా వాట్సప్ యాప్ ఆటోమేటిక్‌గా ఒక మంచి కలర్‌ను సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ రంగు మీకు నచ్చకపోతే మీ ఇష్టప్రకారం మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది.
ప్రస్తుతం ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయి. ఎలాంటి డేట్ ఫిక్స్ చేయకపోయినా.. అతి త్వరలోనే ఈ కొత్త లుక్ మన ఫోన్లలోకి రావడం పక్కా. మీ ఫోన్‌లో కూడా ఈ ఫీచర్ కనిపించాలంటే వాట్సప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి.
Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఊహించని ఆఫర్లు.. ఈ కార్డ్ గనుక ఉంటే సగానికి పైగా డిస్కౌంట్!