E-Paper
Advertisement

హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?
Advertisement

Honda CB500 India Launch: భారత బైక్ మార్కెట్లో హోండా మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 350cc విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ.. ఇప్పుడు పెద్ద ఇంజిన్‌ తో CB500ను విడుదల చేసింది. ఈ కొత్త రెట్రో రోడ్‌ స్టర్ ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.2.75 లక్షలుగా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్‌కు హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

501cc సింగిల్ సిలిండర్ ఇంజిన్!

CB500లో ప్రధాన ఆకర్షణ దాని ఇంజిన్. ఇందులో 501cc సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సుమారు 28hp పవర్, 43.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద సింగిల్ సిలిండర్ మోటార్ కావడంతో తక్కువ, మధ్యస్థ ఆర్‌పీఎం దగ్గర మంచి టార్క్ అందించనుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ బైక్ సిటీ ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా అనువుగా ఉంటుంది.

మూడు వేరియంట్లు.. ధరలు ఎలా ఉన్నాయంటే?   

Advertisement

హోండా CB500ను మూడు వేరియంట్లలో విక్రయిస్తోంది. బేస్ Alloy వేరియంట్ ధర రూ.2.75 లక్షలు. ఇందులో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. Spoke వేరియంట్ ధర సుమారు రూ.2.99 లక్షలు కాగా, క్రాస్ స్పోక్ ట్యూబ్‌ లెస్ రిమ్స్‌ ను కలిగి ఉంటుంది.  టాప్ స్పెక్ Spoke with Stripes వేరియంట్ ధర సుమారు రూ.3.02 లక్షలు. ఇందులో స్పెషల్ కలర్స్, గ్రాఫిక్స్ అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత

ధర మాత్రమే కాకుండా ఫీచర్ల విషయంలోనూ హోండా CB500కు మంచి ప్యాకేజీ ఇచ్చింది. అన్ని వేరియంట్లలో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), స్లిప్పర్ క్లచ్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఆధునిక టెక్నాలజీతో పాటు క్లాసిక్ బైక్ ఫీల్‌ను కలిపే ప్రయత్నం చేసింది. డ్యూయల్ ఛానల్ ABS, LED లైటింగ్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

భారత మార్కెట్లో 500cc సింగిల్ సిలిండర్ బైక్‌లకు కొంతకాలంగా పెద్దగా ఆప్షన్స్ లేవు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 500cc UCE మోడళ్లను 2020లో నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానంలోకి ఇప్పుడు CB500 రావడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ బైక్‌ను భారత్‌లోనే తయారు చేయడం వల్ల ధరను నియంత్రించేందుకు కంపెనీకి అవకాశం లభించింది. ఈ టూ వీలర్ 650cc బైక్‌లకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా మారనుంది.

Read Also: రోనిన్ vs హంటర్ 350.. ధర, పవర్, ఫీచర్లలో ఏ బైక్ ఎలా ఉందంటే?

Tags

Related News

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

డిజైర్ CNG AMT వచ్చేసింది.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే?

త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు అదిరిపోయే లుక్!

చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!

Big Stories

Advertisement
×