WhatsApp : ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ ఫీచర్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ఫామ్ వాట్సాప్ (Whatsapp).. తాజాగా మరో కొత్త అప్డేట్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇన్టాగ్రామ్ (Instagram) తరహాలో ఫోటోలు, వీడియోల బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ను యాడ్ చేసే అప్డేట్ పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్స్ ఉపయోగిస్తున్న మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యాప్ ఇప్పటికే తన యూజర్స్ కోసం లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో పరిచయం చేసింది. ఇక ఇప్పుడు యూజర్స్ ను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నాలు మెుదలు పట్టింది. ఇందుకోసం వినియోగదారులు తమ స్టేటస్ అప్‌డేట్‌లలో మ్యూజిక్ ను యాజ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మెటా ఈ ఫీచర్ కు సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. WhatsAppలో రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ Wabetainfoలో ఈ ఫీచర్ గుర్తించబడింది. ఈ ఫీచర్ ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. రాబోయే ఫీచర్ iOS 25.1.10.73 కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇది TestFlightలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో iOS వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్‌లకు ఆడియో క్లిప్‌లను షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ALSO READ : డ్రైవర్ లేకుండా నడిపే జీప్.. ప్రతిభ చూపిన విద్యార్ధులు..
మెటాతో యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ కాంటాక్ట్ అయ్యి ఈ ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ వినియోగదారులు సంగీత కేటలాగ్ తో బ్రౌజ్ చేయగలిగే విధంగా ఈ ఫీచర్ పని చేస్తుంది. ఇది యూజర్స్ కు ఇష్టమైన ట్రాక్‌లను ఎంచుకుని.. వాట్సాప్ అప్డేట్స్ లో లేటెస్ట్ ఫీచర్స్ ను ఉంచడానికి వీలు కల్పిస్తుంది.
ఇందులో ఫోటోలు, వీడియోలు రెండింటికీ సంగీతాన్ని జోడించవచ్చు. అయితే ఫోటోకు సంగీతం జోడించిన వెంటనే, అది ఎటువంటి మార్పులు చేయకుండానే 15 సెకన్ల వీడియోగా మారుతుంది. వీడియోకు సంగీతాన్ని యాడ్ చేయాల్సి వస్తే వీడియో టైమ్ ను బట్టి ఆ మ్యూజిక్ సెట్ అయిపోతుంది. అయితే ఇందుకోసం సరైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. దీంతోనే సంగీత కేటలాగ్ తో సులభంగా బ్రౌజ్ చేయవచ్చు. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుంటే లేదా ఇంటర్నెట్ పని చేయని చోట ఉన్నట్లయితే వాట్సాప్ లో ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది.
ఇక ఇప్పటికే మెటా ఆధ్వర్యంలో నడుస్తూ ఎంతో ఆదరణ పొందుతున్న ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు, వీడియోలకు సంగీతాన్ని అందించే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ యూత్ ను ఎంతగానే ఆకట్టుకుంటూ వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్ ను వాట్సప్ కూడా తీసుకురావడంతో మరింత మంది యూజర్స్ తేలిగ్గా స్టేటస్ ను మరింత క్రియోటివ్ గా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా యూత్ మరింతగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మెటా భావిస్తున్నట్లు తెలుస్తుంది.