WhatsApp Update: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే వెంటనే మొదట గుర్తొచ్చేది వాట్సాప్. చిన్న మెసేజ్ అయినా, ఫోటో అయినా, వీడియో అయినా అందరికి కంఫర్ట్ ఫీల్ కలిగించే యాప్ ఇది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఎప్పటికప్పుడు యుజర్లకు కొత్త ఫీచర్లు, మెరుగైన అనుభవం అందించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ లాంటి అంశాలను స్టేటస్‌లో షేర్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పుడు ఆ ఫీచర్ మరింత ప్రొఫెషనల్ టచ్‌కు సిద్ధమవుతోంది.
స్టేటస్‌లో కొత్త ‘వీడియో షేరింగ్ ఫ్రీడమ్
ఇప్పటివరకు స్టేటస్‌లో ఒక్కసారి పోస్ట్ చేయదగిన వీడియో నిడివి 60 సెకన్లు మాత్రమే. అంటే 1 నిమిషం ఉండేది. కానీ, WABetaInfo ఫీచర్ లీక్ చేసే ప్రసిద్ధ వెబ్‌సైట్ చెప్పిన దాని ప్రకారం వీడియో నిడివి 90 సెకన్లకు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే, మనం మన స్టేటస్‌లో ఇకపైన ఒకటిన్నర నిమిషం నిడివి గల వీడియోలను పెట్టుకోవచ్చు.
ఇది ఎందుకు గొప్ప ఫీచర్ అంటే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది వీడియో కంటెంట్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు, ఫేస్‌బుక్ స్టోరీస్ అన్నీ చిన్న వీడియోల వినియోగం పెరుగుతుంది. అందుకే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నిటినీ 90 సెకన్లతో క్యాప్‌చర్ చేసి స్టేటస్‌లో వేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా స్మాల్ బిజినెస్ యూజర్లకు బాగా ఉపయోగపడే ఫీచర్.
Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ …
మ్యూజిక్‌తో స్టేటస్
వీడియో నిడివి పెరగడమే కాదు, ఇంకో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే – స్టేటస్‌లో మ్యూజిక్ ప్లే చేయగలిగే ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీ స్టేటస్‌కు మీరు నచ్చిన మ్యూజిక్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో టెస్టింగ్‌లో ఉంది. ఒక ఫోటో పెట్టి దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవచ్చు. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ మ్యూజిక్ ద్వారా బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఇది చాలా ఆకర్షణీయమైన అప్‌డేట్ అని చెప్పవచ్చు.
స్టేటస్ స్క్రీన్‌షాట్ లీక్
WABetaInfo విడుదల చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, కొత్త 90 సెకన్ల స్టేటస్ అప్‌డేట్ త్వరలోనే లైవ్ అవ్వబోతుంది. స్క్రీన్‌పై స్పష్టంగా వీడియో పొడవు మారినట్టు చూపించారు.
డెస్క్‌టాప్ యూజర్లకు అలర్ట్
ఇది ఒకవైపు మంచి టెక్ న్యూస్ అయితే, ఇంకొకవైపు చాలా ముఖ్యమైన సైబర్ హెచ్చరిక కూడా వచ్చింది. భారత ప్రభుత్వం అనుబంధ సైబర్ ఏజెన్సీ అయిన CERT-In, వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వాట్సాప్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. WhatsApp Desktop యాప్‌లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు గుర్తించబడ్డాయి.
ఈ భద్రతా లోపాలు ఏంటి?
-CERT-In ప్రకారం, ఈ లోపాల వల్ల హ్యాకర్లు:
-మీ మెసేజ్‌లను యాక్సెస్ చేయగలరు
-సీక్రెట్ డేటా పొందగలరు
-మీ పర్సనల్ కంప్యూటర్‌ని రిమోట్‌గా కంట్రోల్ చేయగలరు
-వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ వాడే వినియోగదారులు తమ యాప్‌ను వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ లోపాలను ఫిక్స్ చేసే సెక్యూరిటీ ప్యాచ్ -విడుదలైంది. కాబట్టి అప్డేట్ చేయడం వల్ల ప్రమాదం తగ్గుతుంది.