BigTV English

Minister Seethakka: అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం.. అధికారుల్లో మార్పు రావాలి.. మంత్రి సీతక్క

Minister Seethakka: అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం.. అధికారుల్లో మార్పు రావాలి.. మంత్రి సీతక్క

Minister Seethakka: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు కూడా అదే రీతిలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ పనితీరుపై సమీక్షించిన మంత్రి సీతక్క, అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సమీక్ష సమావేశంలో అధికారులు తమ శాఖకు సంబంధించిన అన్ని విషయాలను వివరించిన క్రమంలో మంత్రి సీతక్క పలు అంశాలను లేవనెత్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా కూడా, తీరు మార్చు కోకపోవడం పట్ల సీరియస్ అయ్యారు మంత్రి. అంతేకాదు కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన జరగడంపై అధికారులను మంత్రి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నాణ్యత లేని, శుభ్రత లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అంగన్వాడి చిన్నారులకు సరఫరా చేసే బాల అమృతం ను తయారీ చేస్తున్న టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందని, బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు. నాసి రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చిన్నారులు తినే అంగన్వాడీ పదార్థాలపై ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా, సహించే ప్రసక్తే లేదని మంత్రి అన్నారు.


మంత్రి సమీక్షలో పాల్గొన్న అధికారులు కొద్దిసేపు సైలెంట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో తాము పారదర్శక పాలన సాగిస్తుంటే, అధికారులు ఆ మేరకు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదని, ఫుడ్ సేఫ్టీ శాఖలో ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారి భాద్యత వహించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఏదిఏమైనా మంత్రి సీతక్క మాత్రం.. అధికారులకు వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు.

Also Read: Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో నిప్పులు పోసిన ఇల్లు ఇదే.. దీని ప్రత్యేకతలు తెలిస్తే కళ్లు తిరుగుతాయ్!

ఇక,
తమ సమస్యలు పరిష్కరించాలని, బీఆర్ఎస్ హాయాంలో జరిగిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు కలిసి వినతిపత్రాన్ని అందించారు. వారి వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి అంగన్వాడీ సిబ్బందికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పదవీ విరమణ ప్రయోజనాలు, అప్ గ్రేడ్ అయిన మినీ అంగన్వాడి కేంద్రాల సిబ్బందీకి జీతాల పెంపు, సకాలంలో జీతాలు వంటి అంశాలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు, యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×