E-Paper
Advertisement

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!
Advertisement

Why Does Phone Hang Despite High RAM: మార్కెట్లో ఇప్పుడు 8GB, 12GB లేదా 16GB అంతకంటే ఎక్కువ RAM ఉన్న స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే, చాలా మంది తమ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందని, స్లో అయిపోతోందని బాధ పడుతుంటారు. ఎక్కువ ర్యామ్ ఉన్నప్పుడు ఫోన్ రాకెట్ లా దూసుకుపోవాలి కదా, మరి ఎందుకు హ్యాంగ్ అవుతుంది? ఈ ప్రశ్నే చాలా మందిలో అయోమయాన్ని కలిగిస్తుంది. కేవలం ర్యామ్ ఒక్కటే ఫోన్ స్పీడ్‌కు కారణం కాదు, దీని వెనక బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ సమస్యలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ర్యామ్ అంటే ఏంటి ?

సాధారణంగా ర్యామ్ అనేది ఫోన్ తాత్కాలిక డేటాను నిల్వ చేయడానికి ఉపయోగ పడుతుంది. మనం ఒకేసారి అనేక అప్లికేషన్లను తెరిచినప్పుడు వాటిని సజావుగా రన్ చేయడానికి ఇది సహాయ పడుతుంది. మార్కెట్‌లో రూ. 15,000 నుంచి రూ. 30,000 లేదా అంతకంటే ఎక్కువ ధరల శ్రేణిలో లభించే ఫోన్లలో కూడా ఇప్పుడు భారీ ర్యామ్ ఇస్తున్నారు. అయితే.. కేవలం పెద్ద ర్యామ్ ఉంటే సరి పోదు, ప్రాసెసర్ , సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కూడా చాలా ముఖ్యం. ప్రాసెసర్ బలహీనంగా.. ఉంటే ఎంత ర్యామ్ ఉన్నా ఫోన్ హ్యాంగ్ కాక తప్పదు.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, ప్రాసెసర్ లోడ్:

Advertisement

మనం వాడి వదిలేసిన యాప్స్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి ఇంటర్నెట్ డేటాను వాడుకోవడంతో పాటు ర్యామ్‌ను , ప్రాసెసర్‌ను నిరంతరం ఆక్రమిస్తాయి. సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్ వంటివి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ మెమరీని తీసుకుంటాయి. దీని వల్ల ప్రాసెసర్‌పై అధిక భారం పడి ఫోన్ వేడెక్కడం, హ్యాంగ్ కావడం జరుగుతుంది.

ఇంటర్నల్ స్టోరేజ్ నిండిపోవడం:

చాలా మంది తమ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను 100% నింపేస్తుంటారు. ఫోన్ స్టోరేజ్ దాదాపుగా ఫుల్.. అయినప్పుడు, ఆపరేటింగ్ సిస్టమ్‌కు తాత్కాలిక ఫైల్స్ సేవ్ చేయడానికి తగినంత ఖాళీ స్థలం దొరకదు. దీని వల్ల వర్చువల్ మెమరీ సరిగా పని చేయక ఫోన్ విపరీతంగా స్లో అవుతుంది. కాబట్టి స్టోరేజ్‌లో కనీసం 15 నుంచి 20 శాతం ఖాళీగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

Advertisement

Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ,బగ్స్:

కంపెనీలు అందించే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను సరిగ్గా.. ఇన్‌స్టాల్ చేయక పోవడం లేదా ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే బగ్స్  కారణంగా కూడా ఫోన్లు హ్యాంగ్ అవుతాయి. పాత సాఫ్ట్‌వేర్ కొత్త యాప్స్‌తో.. సింక్ కాకపోవడంతో సిస్టమ్ క్రాష్ అవుతుంది. అలాగే వైరస్ లేదా మాల్‌ వేర్ ఉన్న అనధికారిక యాప్స్‌ను డౌన్‌ లోడ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

ఫోన్ హ్యాంగ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మీ ఫోన్ ఎప్పుడూ స్పీడ్‌గా పని చేయాలంటే కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటించాలి. అనవసరమైన యాప్స్‌ను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయాలి, క్యాచీ ఫైల్స్‌ను క్లీన్ చేయాలి. ఫోన్‌ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేస్తుండాలి. కొత్త ఫోన్ కొనేటప్పుడు.. కేవలం ర్యామ్ మాత్రమే కాకుండా మంచి ప్రాసెసర్ (ఉదాహరణకు స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్లు) ఉన్న మోడళ్లను ఎంచుకోవడం బెస్ట్.

ఎక్కువ ర్యామ్ ఉన్నప్పటికీ ఫోన్ హ్యాంగ్ కావడానికి బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసర్లు, నిండి పోయిన స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ లోపాలు ప్రధాన కారణాలు. ఈ చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్ పని తీరును మెరుగు పరుచుకోవచ్చు.

Related News

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!

కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

Big Stories

Advertisement
×