E-Paper
Advertisement

‘భారత్ సమ్మిట్’ వేదికగా.. కేంద్ర తీరుపై మంత్రులు, మేధావుల విమర్శలు!

‘భారత్ సమ్మిట్’ వేదికగా.. కేంద్ర తీరుపై మంత్రులు, మేధావుల విమర్శలు!
Advertisement

Cooperative Federalism: దేశ రాజ్యాంగ మౌలిక సూత్రమైన ‘సహకార సమాఖ్య’ (కో-ఆపరేటివ్ ఫెడరలిజం) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని పలువురు నేతలు, మేధావులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపులో వివక్ష, గవర్నర్ల ద్వారా రాష్ట్ర బిల్లుల తొక్కివేత, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి చర్యలు రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి పెను ప్రమాదంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత్ సమ్మిట్’లో భాగంగా శనివారం ‘తెలంగాణ అభ్యుదయం – సహకార సమాఖ్య పాలన’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో వక్తలు కేంద్రాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు.

​కనీస మద్దతు ధర ప్రకటించి చేతులెత్తేస్తున్నారు.. మంత్రి ఉత్తమ్

​రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వరి, మొక్కజొన్న వంటి పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించి చేతులు ఎత్తేస్తుందని విమర్శించారు. పూర్తిస్థాయిలో పంటలను కొనుగోలు చేయకపోవడంతో ఆ భారం రాష్ట్రాలపై పడుతోందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడంతో రైతుల నుంచి పంటలు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులు, బహిరంగ మార్కెట్ నుంచి భారీగా అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు.

ఆవేదన వ్యక్తం..

Advertisement

ఈ ఆర్థిక ఒత్తిడికి తోడు ధరల పెరుగుదలపై విపక్షాలు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ప్రజలచే ఎన్నుకోబడిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా తొక్కిపెడితే రాష్ట్రాలకు దిక్కెవరు? తమిళనాడు గవర్నర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పును ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం సమాఖ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ స్థానాలను 542 నుంచి 840కి పెంచితే పార్లమెంటులో ఎంపీల ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇప్పుడే 542 మందిలో ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కడం లేదు. సీట్లు పెంచితే అధికార కేంద్రీకరణ పెరిగి, రాష్ట్రాల శక్తి నిర్వీర్యమవుతుంది’’ అని ఆయన హెచ్చరించారు.

గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు: ఝార్ఖండ్ మంత్రి శిల్పి నేహా..

​ఝార్ఖండ్ మంత్రి శిల్పి నేహా టిర్కీ మాట్లాడుతూ.. తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.36 లక్షల కోట్ల బొగ్గు రాయల్టీ బకాయి పడిందని తెలిపారు. ఎంఎండీఆర్ చట్ట సవరణ ద్వారా బొగ్గు గనులపై కేంద్రమే నేరుగా పన్నులు విధించేలా మార్పులు చేయడం వల్ల ఝార్ఖండ్‌కు ఏటా రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన పీసా చట్టం ద్వారా గిరిజన గ్రామ సభలకు దక్కిన అధికారాలను నేడు ఒడిశాలోని నియంగిరి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అడవుల విషయంలో కాలరాస్తున్నారని విమర్శించారు.

Advertisement

Also read: దుల్కర్ వర్సెర్ సౌమిత్ ..ఓకె కథతో రెండు సినిమాలు…టాలీవుడ్ లో కాపీ వివాదం!

సమాఖ్యకు సుప్రీంకోర్టే రక్ష: ప్రొఫెసర్ గణేష్ దేవీ..

​ప్రముఖ సామాజికవేత్త, రచయిత ప్రొఫెసర్ గణేష్ దేవీ మాట్లాడుతూ.. అంబేడ్కర్, నెహ్రూల దార్శనికతతో రూపుదిద్దుకున్న భారత సమాఖ్య వ్యవస్థ నేడు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్రం కట్టడి చేస్తోందని, రాష్ట్ర జాబితాలోని ప్రాథమిక విద్య, పరీక్షల నిర్వహణలోనూ అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ విద్యా విధానం ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థకు సుప్రీంకోర్టే అసలైన రక్షగా నిలుస్తుందన్నారు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడే న్యాయస్థానాలు స్వచ్ఛందంగా జోక్యం చేసుకుని అడ్డుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు సమాఖ్య స్ఫూర్తికి తగిలిన పెద్ద దెబ్బ అని, లోక్‌సభ స్థానాలు పెంచడం కంటే రాజ్యసభను బలోపేతం చేసే దిశగా సంస్కరణలు ఉండాలని సూచించారు.

​‘కిల్ స్విచ్’లతో ఎన్నికల వ్యవస్థలో కేంద్రీకరణ: ఆదిత్య మెహతా..

​విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్య మెహతా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ, సాంకేతికత పేరుతో కేంద్రం చేతిలో ‘కిల్ స్విచ్’ ఉండేలా వ్యవస్థలను మార్చడం సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడమేనని వ్యాఖ్యానించారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు, విధులు బదిలీ చేయడంలో రాష్ట్రాలు వెనుకాడుతున్నాయని, దీనివల్ల క్షేత్రస్థాయి వికాసం ఆగిపోతోందని చెప్పారు.

​రాజకీయ వివక్షతోనే తెలంగాణకు నిధుల కోత.. ఎంపీ చామల కిరణ్

​భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్’, ‘తెలంగాణ 2047’ లక్ష్యాలు నెరవేరాలంటే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా లేని రాష్ట్రాలపై నిధులు, జలాల పంపిణీలో వివక్ష చూపడం తగదని హితవు పలికారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు.

మధు యాష్కీ గౌడ్..

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక భాగస్వామిగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ స్పష్టం చేశారు. అంతకుముందు సమన్వయకర్త మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. అమెరికా వంటి అగ్రరాజ్యం మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 144 ఏళ్లు తీసుకుంటే, అంబేడ్కర్ రాజ్యాంగం తొలి రోజు నుంచే దేశంలో అందరికీ సమాన ఓటు హక్కు కల్పించిందని గుర్తుచేశారు.ఈ లక్ష్యాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాన నిధుల కేటాయింపు, వనరుల న్యాయమైన పంపిణీ, రాష్ట్రాల హక్కులకు తగిన గౌరవం ఎంతో అవసరం అన్నారు. నిజమైన సహకార సమాఖ్య వ్యవస్థ ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Also Read: ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఊరి మొత్తాన్ని కమ్మేసింది

Tags

Related News

ఏపీ నుంచి తెలంగాణకు భారీగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని మైనింగ్ అధికారులు!

సోనియా 544 పేజీల ఆత్మకథా.. లేక రాజకీయ రణరంగమా..?

మెక్రాన్ రొమాన్స్‌.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?

అప్పుడు బాలీవుడ్.. ఇప్పుడు సోనియా.. కాంట్రవర్సీ ‘క్వీన్’

ఫామ్‌హౌజ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌.. తొలిసారిగా కవితపై విరుచుకుపడ్డ పార్టీ..! సిద్దిపేట అడ్డాగా చేసిన కామెంట్స్‌తో మౌనం వీడి..

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

ఏడేళ్ల కిందటి ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కథతో ‘దాయ్రా’ మూవీ! పృథ్వీరాజ్‌ హీరోగా హిందీ మూవీ..! ఎన్‌కౌంటర్‌ను సమర్థించే పాత్రలో పృథ్వీ!

Big Stories

Advertisement
×