E-Paper
Advertisement

వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!
Advertisement

Whatsapp group privacy settings : ప్రస్తుతం మనమందరం ఎక్కువగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాట్ చేయడం నుంచి ఆఫీస్ వర్క్స్ వరకు ప్రతి ఒక్కటి వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో వాట్సాప్ యూజర్లకు ఒక పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అదేంటంటే.. ఎక్కడో ఉన్న ఎవరో తెలియని వ్యక్తులు మన ఫోన్ నంబర్‌ను తీసుకుని.. తమ ఇష్టానుసారంగా విచిత్రమైన బిజినెస్ గ్రూప్‌లు, స్టాక్ మార్కెట్ టిప్స్ గ్రూప్‌లు లేదా స్పామ్ గ్రూప్‌లలో యాడ్ చేస్తుంటారు. దీనివ ల్ల ఫోన్‌కు నోటిఫికేషన్ల మోత మోగిపోవడంతో పాటు ప్రైవసీ కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యకు వాట్సాప్‌లోనే ఒక పర్మనెంట్ పరిష్కారం ఉంది. అదేంటో స్టెప్-బై-స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సమస్యకు అసలు కారణం ఏంటి?

వాట్సాప్ డిఫాల్ట్ సెట్టింగ్ ప్రకారం.. మీ ఫోన్ నంబర్ ఉన్న ఎవరైనా సరే మిమ్మల్ని నేరుగా ఏదైనా గ్రూప్‌లో యాడ్ చేయడానికి అనుమతిస్తుంది. దీన్ని సైబర్ కేటుగాళ్లు, అడ్వర్టైజర్లు క్యాష్ చేసుకుంటూ రోజు వందలాది మందిని అనధికారిక గ్రూప్‌లలో చేరుస్తుంటారు. దీని వల్ల మన పర్సనల్ నంబర్ పబ్లిక్ అయిపోయి రక రకాల మోసాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఆటోమేటిక్ యాడ్స్‌ను ఎలా నివారించాలి?

Advertisement

మీకు తెలియని వ్యక్తులు లేదా మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వాళ్లు మిమ్మల్ని ఏ గ్రూప్‌లోనూ యాడ్ చేయకుండా ఉండాలంటే.. మీ వాట్సాప్‌లో చిన్న సెట్టింగ్ మార్చుకోవాలి. దానికోసం ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

1.ముందుగా మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.

Advertisement

2. తర్వాత కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్ (Menu) పై క్లిక్ చేసి Settingsలోకి వెళ్లండి.

3. అక్కడ Privacy ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.

4. అందులో కిందకు స్క్రోల్ చేస్తే Groups అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

అక్కడ మీకు మూడు ఆప్షన్లు వస్తాయి..

Everyone (ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయెచ్చు)

My Contacts (మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్నవారు మాత్రమే యాడ్ చేయగలరు)

My Contacts Except… (మీరు సెలెక్ట్ చేసిన నిర్దిష్ట వ్యక్తులు మినహా మిగతా ఎవరూ యాడ్ చేయలేరు)

ఇందులో My Contacts లేదా My Contacts Except అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

Also Read: మీ ఫోన్‌కు వేరే వాళ్ల ఛార్జర్ వాడుతున్నారా? పొరపాటున కూడా ఇలా చేయొద్దు ఎందుకంటే?

ఒకవేళ మీరు My Contacts సెలెక్ట్ చేసుకుంటే.. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని ఏ ఒక్కరూ మిమ్మల్ని కొత్త గ్రూప్‌లో నేరుగా యాడ్ చేయడానికి కుదరదు. ఒక వేళ ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో చేర్చాలనుకుంటే.. ముందుగా వారు మీకు వాట్సాప్ ద్వారా పర్సనల్ లింక్ లేదా ఇన్విటేషన్ పంపాలి. మీరు ఆ ఇన్విటేషన్ అక్సెప్ట్ చేస్తేనే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వగలుగుతారు.

ఇప్పుడే మీ వాట్సాప్ ఓపెన్ చేసి ఈ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌ను మార్చేయండి. అనవసరమైన స్పామ్ గ్రూప్స్ నుంచి పూర్తిగా విముక్తి పొందండి!

Related News

కొత్త ఫోన్ కొనే ముందు..ఈ విషయాలు తెలియకపోతే డబ్బులు వేస్ట్!

జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!

46dB నాయిస్ క్యాన్సిలేషన్, గ్లాస్ & టైటానియం లుక్స్.. Nothing Headphone 1 Pro ఫీచర్లు ఇవే!

సముద్రంలోకి 16 వేల గ్యాలన్ల పింక్ ద్రవం.. తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? అకౌంట్ డేటాను సురక్షితంగా ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

మీ ఫోన్‌కు వేరే వాళ్ల ఛార్జర్ వాడుతున్నారా? పొరపాటున కూడా ఇలా చేయొద్దు ఎందుకంటే?

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్ళు..ఈ 5 విషయాలు అస్సలు మరవద్దు!

Big Stories

Advertisement
×