E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!
Advertisement

Lava Virat V1 Pro 5G: ఒకప్పుడు 5G ఫోన్ అంటే ఖరీదైనది అనుకునే వాళ్లం. కానీ నేటి ఆధునిక యుగంలో బడ్జెట్ సెగ్మెంట్‌లోనూ భారీ బ్యాటరీ, హైరిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా దేశీయ బ్రాండ్ లావా ఇదే టార్గెట్‌తో ‘విరాట్ V1 ప్రో 5G’ను లాంచ్ చేసింది. రూ.15,999 ధరతో వచ్చిన ఈ ఫోన్ లాంచ్ ఆఫర్‌లో రూ.13,999కే లభించనుండటంతో బడ్జెట్ 5G విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారింది.

లావా విరాట్ V1 ప్రో 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.15,999 కాగా, లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ రూ.13,999 ఆఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. సిక్కిం మిడ్‌నైట్, స్పితి ఫ్రాస్ట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 31, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Advertisement

Also Read: Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD+ LCD స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇక పనితీరు విషయానికి వస్తే.. దీనిలో 2.6GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే యూనిసోక్ T8200 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలదు.

Advertisement

ఇక ఈ Lava Virat V1 Pro 5G ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరా ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడటానికి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Lava Virat V1 Pro 5Gలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 6000mAh భారీ బ్యాటరీ గురించి. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ఫోన్ సురక్షితంగా ఉండటానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కోసం IP64 రేటింగ్ అందించారు. వైఫై 5, బ్లూటూత్ 5.4, టైప్-సి పోర్ట్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: 9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

Tags

Related News

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!

చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్‌!

Big Stories

Advertisement
×