E-Paper
Advertisement

ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!

ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Mivi Smartphone: ఇప్పటివరకు బ్రాండెడ్ ఈయర్‌ఫోన్స్, సౌండ్‌బార్స్, స్పీకర్లతో భారతీయ ఆడియో మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వదేశీ బ్రాండ్ మివి (Mivi) ఇప్పుడు కొత్త అడుగు వేస్తోంది. ఆడియో రంగానికే పరిమితం కాకుండా.. మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో దించనుంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక టీజర్ పేజీ కూడా దర్శనమిచ్చింది.

కొత్త డిజైన్‌తో మివి ఫోన్..

ఈ టీజర్ ద్వారా ఫోన్ వెనుక భాగానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, అంచుల్లో కాస్త వంపు తిరిగి ఉన్న డిజైన్‌తో కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఒక లైట్ గ్రీన్ కలర్ వేరియంట్‌ను టీజర్‌లో రిలీజ్ చేశారు. అయితే, కెమెరా మాడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? మిగతా కలర్ ఆప్షన్స్ ఏంటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టీజర్ రావడం వల్ల అతి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Also Read: యాపిల్ బిగ్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్ సహా రాబోతున్న కొత్త డివైజ్‌లివే!

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

మివి తమ మొదటి ఫోన్‌కు ఏం పేరు పెడుతోంది? దీని ధర ఎంత ఉండబోతోంది? అనే విషయాలను ఇప్పటివరకు రహస్యంగానే ఉంచింది. ఇది 4G ఫోనా లేక 5G సాంకేతికతతో వస్తుందా అనే దానిపై కూడా కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. డిస్‌ప్లే సైజ్, ప్రాసెసర్, కెమెరా సామర్థ్యం, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ వంటి కీలక వివరాలు తెలియాల్సి ఉంది. కంపెనీ స్వయంగా వెల్లడించే వరకు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకపోవడమే మంచిది.

ఆడియో నుంచి మొబైల్ రంగానికి..

Advertisement

భారతీయ వినియోగదారులకు మివి అనగానే బడ్జెట్ ధరలో లభించే సౌండ్‌బార్స్, ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ గుర్తుకొస్తాయి. తమ ఆడియో ప్రొడక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్.. ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టడం ఒక పెద్ద పరిణామమనే చెప్పాలి.

పోటీని తట్టుకుని నిలబడేనా?

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా తీవ్రమైన పోటీతో కూడుకుని ఉంది. ఇప్పటికే షియోమి, రియల్‌మీ, పోకో, మోటరోలా వంటి బ్రాండ్లు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మివి తీసుకొచ్చే ఫోన్ మార్కెట్‌లో నిలబడాలంటే.. మంచి ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోవడానికి మొబైల్ ప్రియులు మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Also Read: Realme 17 Pro Plus లీక్డ్ ఫీచర్లు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?

Tags

Related News

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

Big Stories

Advertisement
×